Watch: వ్యాన్‌కు వ్యాపించిన మంటలు.. పేలి గాల్లోకి ఎగిరిన వాహనం
Van Thrown Into Air | మండే వేసవి వల్ల పలు వాహనాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వ్యాన్‌కు మంటలు వ్యాపించాయి. అయితే ఉన్నట్టుండి పేలడంతో ఆ వాహనం గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: మండే వేసవి వల్ల పలు వాహనాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక వ్యాన్‌కు మంటలు వ్యాపించాయి. అయితే ఉన్నట్టుండి పేలడంతో ఆ వాహనం గాల్లోకి ఎగిరింది. (Van Thrown Into Air) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఖాన్పూర్ ప్రాంతంలో పార్క్ చేసిన మారుతీ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. సుమారు 20 నిమిషాలపాటు ఆ వాహనం కాలిపోయింది. అనంతరం పెట్రోల్ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో ఆ వ్యాన్ గాల్లోకి ఎగిరి పడింది.
కాగా, ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఆ వ్యాన్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమాలో మాదిరిగా మంటల్లో కాలిన వ్యాన్ గాల్లోకి ఎగురడం చూసి నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. కాగా, వేసవి కాలంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.
देखिए बुलंदशहर मारुति वैन में आग लगने के बाद हुआ ज़ोरदार धमका,धमाके से वैन के परखच्चे उड़े pic.twitter.com/xx8vf1IIgs
— Lavely Bakshi 🔺 (@lavelybakshi) May 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- blast
- fire
- Into Air
- Maruti Van
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

