watch: కుమారుడితో ఓటు వేయించిన బీజేపీ నేత.. వీడియో వైరల్
BJP Leader's Minor Son Cast Vote | బీజేపీ నేత ఒకరు తన కుమారుడితో ఓటు వేయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ నేత చర్యను కాంగ్రెస్ పార్టీ నేత తప్పుపట్టారు. చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను డిమాండ్ చేశారు.
భోపాల్: బీజేపీ నేత ఒకరు తన కుమారుడితో ఓటు వేయించారు. ( BJP Leader’s Minor Son Cast Vote) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ నేత చర్యను కాంగ్రెస్ పార్టీ నేత తప్పుపట్టారు. చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్(ఈసీ)ను డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌లోని బెరాసియా లోక్‌సభ నియోజకవర్గానికి మంగళవారం పోలింగ్ జరిగింది. బీజేపీకి చెందిన పంచాయితీ నాయకుడైన వినయ్ మెహర్ తన కుమారుడితో కలిసి పోలింగ్ బూత్‌కు వెళ్లారు. తన తరుఫున కుమారుడితో ఓటు వేయించారు. ఈవీఎంపై బీజేపీ గుర్తు ఉన్న బటన్‌ను ఆ బాలుడు నొక్కాడు. తర్వాత ఓటు నమోదైందా? లేదా? అన్నది వీవీపాట్‌లో చూసుకున్నారు.
కాగా, బీజేపీ నేత వినయ్ మెహర్ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్‌ను ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మీడియా సలహాదారుడైన పీయూష్ బాబెలే ఆరోపించారు. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో ఆయన షేర్ చేశారు. తండ్రితోపాటు పిల్లవాడ్ని, మొబైల్ ఫోన్ రికార్డింగ్‌ను పోలింగ్ బూత్‌లో ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ (ఈసీ)ను పిల్లల ఆట వస్తువుగా బీజేపీ మార్చిందని విమర్శించారు. దీనిపై ఏమైనా చర్య తీసుకుంటారా? అని నిలదీశారు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ స్పందించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆ పోలింగ్ బూత్ వద్ద ఉన్న ప్రిసైడింగ్ అధికారి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ వీడియో క్లిప్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) ఇంకా స్పందించలేదు.
भाजपा ने चुनाव आयोग को बच्चों का खिलवाड़ बना दिया है। भोपाल में भाजपा के जिला पंचायत सदस्य विनय मेहर ने नाबालिग बेटे से डलवाया वोट। वोट डालते वक्त का विनय मेहर ने वीडियो भी बनाया। वीडियो फेसबुक पर विनय मेहर ने किया पोस्ट।
कोई कार्रवाई होगी? pic.twitter.com/M7kSZUJtCW— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) May 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

