(Women Drop) కాకినాడ : మహిళల భద్రతకు కాకినాడ జిల్లా పోలీసు శాఖ కీలక ముందడుగు వేసింది. ‘ఉమెన్ డ్రాప్ ఎట్ హోం’ అనే కొత్త సేవలను ప్రారంభించింది. ఈ సేవలకు ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర మహిళలు రాత్రి సమయాల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ సేవలను పొందవచ్చు. రాత్రి వేళల్లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్న నేపథ్యంలో ఈ డ్రాప్ ఎట్ హోం సేవలను ప్రారంభించడం హర్షణీయం.
డ్రాప్ ఎట్ హోం వాహన సేవలు ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వాహనంలో పోలీసు డ్రైవర్, మహిళా కానిస్టేబుల్ ఉంటారు. వాహన నియంత్రణ జిల్లా పోలీసు కంట్రోల్ రూంతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ సేవలను కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ పర్యవేక్షిస్తారు. 94949 33233 లేదా 94907 63498 నంబర్లకు ఫోన్ చేసి ‘ఉమెన్ డ్రాప్ ఎట్ హోం’ సేవలను పొందవచ్చునని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కాకినాడ నగరానికే పరిమితమయ్యాయని, భవిష్యత్లో జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..