(TTD Contract Employees) తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమను టీటీడీ కార్పొరేషన్లో కలుపాలంటూ వారం రోజులుగా విధులు బహిష్కరించి ఎఫ్ఎంఎస్ సర్వీసెస్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. చెత్త పోరుకుపోవడంతో దుర్గంధంగా తయారవుతున్నది.
టీటీడీ కార్పొరేషన్లో తమను విలీనం చేయాలంటూ ఎఫ్ఎంఎస్ సర్వీసెస్ ఉద్యోగులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఫలితంగా కొండపై పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా కాంట్రాక్ట్ సంస్థ కొందరు తాత్కాలిక కార్మికులను నియమించి గదులను శుభ్రం చేయించే పనులు చేపట్టింది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో గదులను శుభ్రం చేయడం కుదరకపోవడంతో దుర్గంధం వ్యాప్తిస్తున్నది. దాంతో గదులను భక్తులకు కేటాయించడాన్ని టీటీడీ నిలిపివేసింది. గదుల కేటాయింపుపై సమాధానం ఇచ్చే అధికారే కరవయ్యారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ బోర్డు తగు చర్యలు తీసుకుని గదుల కేటాయింపు జరుపాలని, గదులను శుభ్రం చేయించాలని భక్తులు కోరుతున్నారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..