London | పాకిస్తానీయుల దాడి.. లండన్‌లో భారతీయ రెస్టారెంట్ మూసివేత.. యజమాని స్పందన ఇదే
London : లండన్‌లో భారత సంతతి వ్యక్తి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా పాకిస్తాన్ దేశీయులు అతడి ఇండియన్ రెస్టారెంట్‌పై తరచూ దాడి చేస్తుండటంతో చివరకు దాన్ని మూసివేయనున్నాడు.
London : లండన్‌లో భారత సంతతి వ్యక్తి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా పాకిస్తాన్ దేశీయులు అతడి ఇండియన్ రెస్టారెంట్‌పై తరచూ దాడి చేస్తుండటంతో చివరకు దాన్ని మూసివేయనున్నాడు. 16 ఏళ్ల నిర్వహణ తర్వాత తన రెస్టారెంట్‌ను వచ్చే నెలలో మూసేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన వివరాల్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
లండన్‌లో హర్మాన్ సింగ్ కపూర్ అనే భారత సంతతి వ్యక్తి రంగ్రేజ్ అనే భారతీయ రెస్టారెంట్‌ను హ్యామ్మర్స్మిత్ ప్రాంతంలో 16 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతోపాటు ఆన్లైన్ వేధింపులు, ముఖ్యంగా పాకిస్తానీయుల నుంచి తరచూ ఎదురవుతున్న దాడులు, బెదిరింపులు, అలాగే ఈ దాడుల అంశంలో పోలీసుల నుంచి సరైన మద్దతు లేని కారణంగా ఈ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించాడు. తనకు ఇన్నాళ్లు మద్దతు తెలిపిన కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. తన వ్యాపారన్ని అతివాదులు అడ్డుకోవచ్చని, బిజినెస్ ఆగిపోయేలా చేయొచ్చని.. కానీ, తన ఆలోచనల్ని అడ్డుకోలేరన్నాడు. అయితే, ఇకపై తనకు వ్యాపారం లేదు కాబట్టి, తాను మరింతగా రాటుదేలుతానని ప్రకటించాడు. ఇకపై తన పూర్తి సమయాన్ని తన సిద్ధాంతాల కోసమే కేటాయిస్తానన్నాడు.
మరింత బలంగా దూసుకెళ్తానని చెప్పాడు. హర్మాన్ సింగ్ లండన్‌లో జరిగిన ఖలిస్తాని ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. అలాగే అక్కడ పెరిగిపోతున్న హింస, అతివాద భావజాలాన్ని కూడా వ్యతిరేకించాడు. అమృత్‌పాల్ సింగ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించాడు. దీంతో అతడి రెస్టారెంట్‌పై గతంలో స్థానిక ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. అయితే, ఇకపై తాను మరింతగా ఉద్యమిస్తానని హర్మాన్ సింగ్ వెల్లడించాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

