KTR | నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 24 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు నాగర్ కర్నూల్‌కు వెళ్లనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దాడిలో మరణించిన 2 నెలల పసిపాప కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించనున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకుంటారని తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఉదయం 11:30 వరకు కేటీఆర్ నాగర్ కర్నూల్ కు చేరుకుంటారన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ తరలివచ్చి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని.. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు
ఇటీవల నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో నిర్వాహకులు సర్పంచ్ సహా తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి కన్నిరెడ్డి, కుఫేందర్ రెడ్డి, మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్నిఅడ్డుకొని దాడి చేశారని తెలిసిందే. తక్కువ జాతి వారని సదరు బీసీ కుటుంబాన్నినిర్వాహకులు గుడిలోకి అనుమతించలేదు. దేవుడి దర్శనం చేసుకోకుండా తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించినందుకు చాకలి చంద్రకళను, ఆమె కొడుకు గణేష్‌ను, కోడలిని, కూతురిని బూతులు తిడుతూ నిర్వాహకులు దారుణంగా కొట్టారు.
రెండు నెలల చిన్నారి మొహం చూసైనా తమను వదిలేయమని చంద్రకళ కుటుంబసభ్యులు వేడుకున్నా కనికరించకుండా నిర్వాహకులు ఆ చిన్నారిని కాలుతో తన్నారు. ఈ దాడిలో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతికి కారణమైన కాంగ్రెస్ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా జనాలు ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తున్నారని తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ దర్యాప్తునకు ఆదేశించింది.
Karthika Deepam | కార్తీక దీపం రెండో సీజన్ 600 ఎపిసోడ్లు పూర్తి.. ప్రత్యేక ప్రోమోతో సంబరాలు
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమలకు పెరగనున్న రద్దీ.. వేగంగా దర్శనాలు పూర్తయ్యేలా టీటీడీ ఏర్పాట్లు