నారాయణపేట, ఆగస్టు 7 : నారాయణపేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో గురువారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటలు దాటినా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారు.
వైద్య సేవలకు అవసరమైన సమయంలో కూడా విద్యుత్తు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఇతర విభాగాల సేవలకు సైతం సిబ్బంది టార్చ్‌లైట్ వెలుగును ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది.