హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం, అత్యాధునిక సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సేవలు అభినందనీయమని డీజీపీ సీవీ ఆనంద్ కొనియాడారు. శుక్రవారం సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్, సీపీలు, ఎస్పీలతోపాటు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
సైబర్ నేరాల నియంత్రణ కోసం స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎస్4సీ) కింద ప్రత్యేక ‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటుచేసిన తొలి రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. రూ.5 లక్షలు, అంతకంటే ఎకువ విలువైన సైబర్ మోసాల కేసుల్లో 49 ఈ-జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపారు.