Delhi High Court | యువతితో శృంగారం.. జాతకాల సాకుతో పెళ్లికి నిరాకరణ.. ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే..!
Delhi High Court | అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నిరాకరించింది. నిందితుడి బెయిల్ పిటిషన్ (Bail petition) ను కొట్టివేసింది.
Delhi High Court : అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నిరాకరించింది. నిందితుడి బెయిల్ పిటిషన్ (Bail petition) ను కొట్టివేసింది. నిందితుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి బాధితురాలితో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత జాతకాలు కలువలేదనే సాకుతో పెళ్లికి నిరాకరించాడని, ఇది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 ప్రకార తీవ్ర నేరమని, కాబట్టి నిందితుడికి బెయిల్ ఇవ్వలేమని, అతడి పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని కోర్టు స్పష్టంచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. మన జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయని, త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత యువతి పెళ్లి చేసుకుందామని అడగడంతో అతడు నిరాకరించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని, అతడి కుటుంబసభ్యులను పిలిపించి మాట్లాడటంతో.. పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చి కేసును విత్‌డ్రా చేయించారు.
ఆ తర్వాత కొన్ని రోజులకు జాతకాలు కలువలేదన్న సాకుతో పెళ్లికి నిరాకరించారు. దాంతో బాధితురాలు మళ్లీ కేసు పెట్టింది. జాతకాలు కలిశాయని, పెళ్లి చేసుకుందామని అతడు గతంలో తనకు పంపించిన వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులకు చూపించింది. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు నిందితుడిని లొంగిపొమ్మని గడువు విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో నిందితుడు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

