Tilak Varma : స్వదేశంలో ఫేవరెట్‌గా.. మూడో ప్రపంచకప్ వేటలో దూసుకెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా బ్రేకులు వేసింది. ఆల్‌రౌండ్ షోతో టీమిండియాను ఓడించి.. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)సేన బలహీనతలను బట్టబయలు చేసింది. తుది జట్టులో మార్పులు, టాపార్డర్ వైఫల్యం ప్రధాన కారణాలు కాగా.. ఓ ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయే వారే కరువవ్వడం విజయావకాశాల్ని ఘోరంగా దెబ్బతీసింది. వెస్టిండీస్ చేతిలో జింబాబ్వే చిత్తుగా ఓడిన వేళ.. భారత్ సెమీస్ అవకాశాలు మిణుకుమిణుకు మంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యువ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma)కు మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) విలువైన సలహా ఇచ్చాడు.
పొట్టి ప్రపంచకప్‌లో ఒకేఒక ఓటమి భారత్‌ను పునరాలోచనలో పడేసింది. జట్టు కూర్పు.. ఆటగాళ్ల ఫామ్‌ను బేరీజు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పకనే చెప్పింది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మలపై వేటు వేసి.. సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. సూపర్ 8లో తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్ ఔట్ కావడంతో బాధ్యతగా ఆడాల్సిన తిలక్.. పొడగరి పేసర్ యాన్సెన్‌ను టార్గెట్ చేయబోయి వికెట్ కీపర్ చేతికి దొరికాడు. అనవసరంగా వికెట్ ఇచ్చేశాడని ఈ యంగ్‌స్టర్‌ను సునీల్ గవాస్కర్ గట్టిగానే విమర్శించాడు. ఇక మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. తిలక్‌కు విలువైన సలహాలు ఇచ్చాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ మాదిరిగా ఇన్నింగ్స్ నిర్మించాలని యువ బ్యాటర్‌కు బోధించాడు.
Mohammad kaif covers all about Virat kohli passion of cricket domination
Thank you @MohammadKaif to covers this. This video must send to Abhishek Sharma, Tilak Varma, Ishan Kishan and Rinku Singh.#INDvsSA #T20WorldCup pic.twitter.com/q91fCsUdWJ— Cricket Nation (@Championkumar01) February 23, 2026
‘తిలక్ వర్మకు సొంత స్టయిల్ ఉంది. తక్కవ స్ట్రయిక్ రేటుతోనూ ఆడగలడు. కానీ, పెద్ద షాట్ ఆడే క్రమంలో ఔటవుతున్నాడు. స్ట్రయిక్ రేటు ఒత్తిడి అందుకు ఓ కారణం. ఆటగాడిగా కోచ్, కెప్టెన్ చెప్పిన పని చేయడం చాలా ముఖ్యం. అతడు విరాట్ కోహ్లీ పాత్రను పోషించాలి. కానీ,. సఫారీలతో మ్యాచ్‌లో తన బాధ్యతను మరిచి.. బిగ్ షాట్‌కు యత్నించాడు తిలక్. ఛేజ్ మాస్టర్ అవ్వాలంటే.. 20 ఓవర్ల వరకూ ఆడాలి. అయితే.. తిలక్ మాత్రం త్వరగా పెవిలియన్ చేరుతున్నాడు. జట్టులో అభిషేక్, ఇషాన్, సుందర్, సూర్యకుమార్, హార్దిక్, రింకూ. వీరంతా అటాకింగ్ గేమ్ ఆడేవాళ్లే. అప్పుడు క్రీజులో నిలిచి.. చివరివరకూ నిలబడేది ఎవరు? ఈ బాధ్యతను తిలక్ తీసుకోవాలి’ అని కైఫ్ వెల్లడించాడు.
Pakistani thought they won this Asia Cup final..
But Stop ! Stop! Stop! Your father Tilak Varma was their 😃
— Victor (@Hitmanhit4de) February 13, 2026
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ బౌలర్లను ఉతికేసి.. అజేయ అర్ధ శతకంతో భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మపై ప్రపంచకప్‌లో కీలకం అతుతాడనుకున్నారంతా. కానీ, మనోడు మాత్రం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ విన్నంగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. ఓపెనర్లు విఫలమైన వేళ.. అడ్డుగోడలా క్రీజులో నిలిచి పరుగులు రాబట్టాల్సిన ఈ హైదరాబాదీ కుర్రాడు తేలికగా వికెట్ ఇచ్చేస్తూ విమర్శల పాలవుతున్నాడు. ఐదు మ్యాచుల్లో 107 రన్స్ చేశాడంతే.
🚨 CURIOUS CASE OF TILAK VARMA AS A T20 BATTER 🚨
Scored a plethora of runs for Mumbai Indians in the IPL
Looked cut above the rest at a very young age
Got selected for India very early
Played some fascinating innings, looked million dollar in his initial phase
Won India the… pic.twitter.com/oxjitp5FvL
— All about Cricket (@CricHitmanThala) February 24, 2026
నాకౌట్ తొలి పోరులో 76 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. తర్వాతి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిచినా సెమీస్ అవకాశాలు కష్టమే. ఎందుకుంటే.. జింబాబ్వేను ఏకంగా 107 రన్స్‌తో చిత్తు చేసిన వెస్టిండీస్ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా.. తదుపరి రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ముందంజ వేస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత్ సెమీస్ చేరాలంటే నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్‌రేటు మెరుగపడాలి. అందుకోసం ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేను, మార్చి 1న విండీస్‌ను చిత్తుగా ఓడించాలి. అపై.. జింబాబ్వే, సఫారీ టీమ్‌ల మ్యాచ్ ఫలితాలపై సూర్యకుమార్ సేన భవితవ్యం ఆధారపడనుంది.