Student suicide: చదువులో వెనకబడ్డానని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Student suicide : గజపతినగరం మండలం పిడిశీల గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో వెనకబడిపోయానని బాధపడుతూ...

(Student suicide) విజయనగరం : గజపతినగరం మండలం పిడిశీల గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో వెనకబడిపోయానని బాధపడుతూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తున్నది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం శ్యామలవలస గ్రామానికి చెందిన తడ్డి ఉష (18) తాతయ్య ఇంటి నుంచి పిడిశీల గ్రామంలో చదువుతున్నది. ఉష తల్లిదండ్రులు పార్వతి, రమణమూర్తి విజయనగరం మయూర జంక్షన్ సమీపంలో టిఫిన్ దుకాణం నడుపుతూ జీవితం వెళ్లదీస్తున్నారు. ఉష గజపతినగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నది. బైపీసీ స్ట్రీమ్ చదివే ప్రయత్నం చేయలేక చదువులో వెనకబడిపోయింది. గత రెండు రోజులుగా కాలేజీకి వెళ్లలేదు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ పొలానికి వెళ్లడం గమనించిన ఉష.. ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఉష ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు సీఐ రమేష్, ఎస్ఐ గంగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

