MLA Naini Rajender Reddy | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతల భూదందాలు ఎలా కొనసాగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, వారి అనుచరుల ఆగడాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన మరో ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంత సారంగపాణి వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భూకబ్జా వ్యవహారంలో వరంగల్ వెస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట బాధిత కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
పలుమార్లు అధికారులకు చెప్పినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆత్మహత్యాయత్నం చేయగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ ఫిర్యాదుపై అధికారులు స్పందించి, విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే నాయిని క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధిత కుటుంబ సభ్యులు
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంత సారంగపాణి వల్ల తమకు ప్రాణహాని ఉందని, తమ భూమిని… pic.twitter.com/huylIwzAZp
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026