Asian Games : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత బృందం(Indian Contingent) తీవ్రంగా నిరాశపరిచింది. మూడేళ్ల క్రితం హంగ్జౌలో వంద (106)కుపైగా పతకాలతో అదరగొట్టిన మన క్రీడాకారులు ఈసారి గురితప్పారు. శుక్ర, శనివారాల్లో ఆర్చర్లు, హాకీ జట్లు స్వర్ణాలతో మోత మోగించినా సెంచరీ కొట్టలె. ఆఖర్లో రెజ్లర్లు అమన్ షెహ్రావత్(57 కిలోలు), అంతిమ్ పంఘాల్(53 కిలోలు), దీపక్ పూనియా(97 కిలోలు) గెలిచిన పసిడి, వెండి, కాంస్యాలతో కలిపి.. 85 పతకాలు వచ్చాయంతే. ఫలితంగా భారత్ ఇప్పుడు కూడా నాలుగో స్థానంలోనే నిలిచింది.
జపాన్ ఆతిథ్యమిచ్చిన ఆసియా క్రీడల్లో భారత బృందం సెంచరీ కొట్టలేకపోయింది. ఐచీ నగోయ వేదికగా జరిగిన ఈ పోటీల్లో షూటర్లు, ఆర్చర్లు, అథ్లెట్లు మెరిసినా కూడా వందకు 15 పతకాల దూరంలో ఆగిపోయింది భారత్. పోటీల చివరి రెండు రోజుల్లో జోరు చూపించిన మన క్రీడాకారులు పోడియం మీద మెరిసినా సరిపోలేదు. శనివారం పురుషుల హాకీ జట్టు స్వర్ణం సాధించగా.. రెజ్లర్లు అమన్ షెహ్రావత్(57 కిలోలు) పసిడి వెలుగులు విరజిమ్మాడు.
𝗔𝗦𝗜𝗔𝗡 𝗚𝗔𝗠𝗘𝗦 𝟮𝟬𝟮𝟲: 𝗔 𝗛𝗜𝗦𝗧𝗢𝗥𝗜𝗖 𝗖𝗛𝗔𝗣𝗧𝗘𝗥 𝗙𝗢𝗥 𝗜𝗡𝗗𝗜𝗔𝗡 𝗛𝗢𝗖𝗞𝗘𝗬! 🇮🇳🏑🏆
The Indian Women’s Team ended a 44-year wait for Asian Games gold, while the Men’s Team successfully defended their crown and together, they’ve delivered a historic golden… pic.twitter.com/44Wf9Rax61
— Hockey India (@TheHockeyIndia) October 3, 2026
మహిళల ఫ్రీ స్టయిల్ 53 కిలోల ఫైనల్లో తడబడిన అంతిమ్ పంఘాల్ రజతంతో మురవగా.. 97 కిలోల విభాగంలో ఆరు దశాబ్దాల కలను సాకారం చేస్తూ కాంస్యం గెలిచాడు దీపక్ పూనియా. దాంతో.. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలకే పరిమితమైన భారత్ పతకాల పట్టికలో నాలుగో ర్యాంకుతో సరిపెట్టకుంది. మూడేళ్ల క్రితం హంగ్జౌలో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 40 కాంస్యాలతో పతకాలు సాధించింది మన బృందం. టోర్నీ ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన చైనా ఏకంగా 341 మెడల్స్‌తో అగ్రస్థానం కైవసం చేసుకుంది.
ఆసియా క్రీడల్లో అత్యధిక పతకాలతో చైనా, జపాన్, దక్షిణ కొరియాలు వరసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 85 పతకాలతో భారత్ నాలుగో ప్లేస్లోఉండగా.. 56 మెడల్స్ గెలిచిన ఉజ్బెకిస్థాన్ ఐదో స్థానంతో టోర్నీని ముగించింది.
1 చైనా – 169 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్యాలు – 341 పతకాలు
2 జపాన్ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 269 పతకాలు
3 దక్షిణ కొరియా – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 150 పతకాలు
4 భారత్ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 85 పతకాలు
5 ఉబ్జెకిస్థాన్ – 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు – 56 పతకాలు
🇮🇳 INDIA FINISH 4TH IN THE MEDAL TALLY AT THE ASIAN GAMES 2026!
21 GOLD 🥇27 SILVER 🥈 37 BRONZE 🥉
TOTAL – 85 MEDALS
A campaign filled with Olympic quotas, historic moments, heartbreaks and disappointments.
But surely, one that we’ll remember for a long time.
After a… pic.twitter.com/WBNH9R8Dr7
— The Khel India (@TheKhelIndia) October 3, 2026