– ప్రధాన రహదారిపై బైఠాయించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 03 : వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ అందిస్తామని చెబుతున్న పాలకులు కనీసం ఏడు గంటలు కూడా సక్రమంగా అందించడం లేదని, అందుబాటులో ఉన్న కరెంటు కోతలు విధిస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భూదాన్ పోచo పల్లిలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై పార్టీ ఆధ్వర్యంలో బైటాయించి సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి నాలుగు హామీలు కూడా నెరవేర్చలేదని విమర్శించారు. స్వలాభం తమ్ముల కోసం భూ కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వo నడపడం చేతకాదు కానీ విషయం అడుగుతే విషం కక్కుతున్నారని , వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పి మళ్ళీ ప్రజలంతా కేసిఆర్ పరిపాలన రావాలని కోరుకుంటున్నారన్నారు.
ప్రభుత్వం ఎవరి సంక్షేమం, లబ్ధి కోసం మెప్పుకోసం చేస్తున్నారని, 24 గంటలు ఇచ్చే కరెంటును ఏడు గంటలకు దిగజార్చడని విమర్శించారు . అబద్దాలతో ప్రజల్ని మధ్య పెడుతూ, అబద్ధాలు ఆడితేనే ఓట్లు వేస్తారని ప్రజల్ని మోసం చేసే నైజం రేవంత్ రెడ్డిది అన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే పార్టీని రేవంత్ రెడ్డిని ఒక కిలోమీటర్ లోతులో పాతి పెడతారని ఆయన హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారని, సంక్షేమ పథకాలు అమలు చేయలేక ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని విమర్శించారు. రైతు సంక్షేమ మే అంటూ వ్యవసాయాన్ని పండగల చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరిస్తుందని, పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న పంటలు రక్షించేందుకు 14 గంటల కరెంటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు ధర్నా కార్యక్రమాన్ని తెలుసుకుని ట్రాన్స్కో ఏడీ పద్మ స్పందిస్తూ రోజు 10 గంటల విద్యుత్ సరఫరా అందజేస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్, సర్పంచ్ సామ రవీందర్ రెడ్డి, నాయకులు రావుల శేఖర్ రెడ్డి, గునిగంటి మల్లేష్, చేరాల నరసింహ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు ముత్యాల మహిపాల్ రెడ్డి, పగిళ్ల సుధాకర్ రెడ్డి, నోముల మాధవరెడ్డి, అయితరాజు భిక్షపతి, మహేష్, కౌన్సిలర్లు బాతుక లింగస్వామి, పెద్దల చక్రపాణి, నాయకులు రంగ విశ్వనాథం, పగిళ్ల రామ్ రెడ్డి, పీసర్ల మైపాల్ రెడ్డి, ఫకీరు సుధాకర్ రెడ్డి, కలుకూరి శ్రీకాంత్, కర్నాటి నరసింహ, మట్ట సుదర్శన్, పర్వతం అశోక్, యాకరి నర్సింగ్ రావు, కాటంరాజు, చిల్లర జంగయ్య, దుర్గం నరేష్, వాకిట బాల్ రెడ్డి, తంగేళ్ల దశరథ, సిద్ధగోని లింగస్వామి, గుండు రాజమణి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.