హుజూర్ నగర్, అక్టోబర్ 03 : క్రీడలతో ఇరువర్గాల మధ్య స్నేహ భావం పెంపొందుతుందని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో శనివారం గంజాయి నిర్మూలనకు మద్దతుగా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అడ్వకేట్ల ఫ్రెండ్లీ క్రీడా పోటీల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడానికి పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. జర్నలిస్టులు, అడ్వకేట్లు పేరు నమోదు చేసుకుని పోటీలలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఎస్ఐ నరేష్, టోర్నమెంట్ కన్వీనర్ మోర్తాల నాగిరెడ్డి, జర్నలిస్టులు కోలా నాగేశ్వరరావు, దుగ్గి ఉషశ్రీ, దొంతగాని రాజా రమేష్, షేక్ జానీ పాషా, నక్క నరేష్ పాల్గొన్నారు.