Smit Machchhar : ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో భారత పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. గొడ్డలి పోట్లకు గురైనా విమానాన్ని నేల కూల్చకుండా కాపాడి, దాదాపు 180 మంది ప్రాణాల్ని ఆయన రక్షించారు. దీంతో ఏకంగా దేశాధినేతలే ఆయనను అభినందిస్తున్నారు. తాజాగా దుబాయ్ యువరాజు కూడా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను అభినందించారు.
గాయాలతో యూఏఈలో చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్‌ను దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మొక్తువోమ్ శనివారం పరామర్శించారు. తోటివారి ప్రాణ రక్షణ కోసం స్మిత్ మచ్చర్ అత్యున్నత ధైర్యాన్నిప్రదర్శించారని ప్రిన్స్ షేక్ హమ్దాన్ అన్నారు. ఆయనను చూస్తే ఎంతో గర్వంగా ఉందన్నారు. అలాగే, అతడు తమ దేశ గాథల్లో భాగమైనందుకు హర్షం వ్యక్తం చేశారు. యూఏఈ.. శాంతి కోసం, జీవితాల కోసం ఉంటుందని, అదే తమ సిద్ధాంతమని అన్నారు. తమ దేశ నాయకత్వం స్మిత్ మచ్చర్‌ను అభినందిస్తుందని తెలిపారు. ప్రిన్స్.. దుబాయ్ ఉప ప్రధాని కూడా.
During a visit to Captain Smit Machchhar… the flydubai pilot who embodied the highest degrees of courage, responsibility, and care for human life.
From us, and from the leadership of the nation, he has our full appreciation and praise.
We are proud that he is part of our… pic.twitter.com/QgpQxdcK5C
— Hamdan bin Mohammed (@HamdanMohammed) October 3, 2026
అలాగే, యూఏఈ రక్షణ మంత్రిగా కొనసాగుతున్నారు. స్మిత్ మచ్చర్‌ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. గత బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన విమానాన్ని కో పైలట్ కూల్చాలనుకున్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పైలట్ స్మిత్ మచ్చర్ విమానాన్ని కూల్చకుండా అడ్డుకున్నాడు. ఒకపక్క కో పైలట్ పొడిచినా సరే మొక్కవోని ధైర్యంతో విమానాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. విమానంలోని దాదాపు 180 మంది ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు.