తుంగతుర్తి, ఆగస్టు 06 : విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీఏఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, జిల్లా అధ్యక్షుడు యామా రమేశ్ కోరారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీఏఎస్ సంఘం నాయకులు, టీచర్లు పాల్గొన్నారు.