Dorothy | ‘డొరోతి’ సినిమాపై కార్తిక్ సుబ్బరాజు ఎమోషనల్ పోస్ట్.. నా మొదటి సినిమా ‘పిజ్జా’ విడుదల నాటి టెన్షన్ అలాగే ఉంది!
Dorothy | ప్రముఖ తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తన 10వ సినిమా 'డొరోతి' (Dorothy) విడుదల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజున తనలో ఉండే ఉత్సాహం, టెన్షన్ తన మొదటి సినిమా 'పిజ్జా' విడుదల నాటిలాగే ఉందని ఆయన పేర్కొన్నారు.
Dorothy | ప్రముఖ తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తన 10వ సినిమా ‘డొరోతి’ (Dorothy) విడుదల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజున తనలో ఉండే ఉత్సాహం, టెన్షన్ తన మొదటి సినిమా ‘పిజ్జా’ విడుదల నాటిలాగే ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సినిమాను తెరకెక్కించిన రోజులు వ్యక్తిగా, ఒక ఫిల్మ్‌మేకర్‌గా, కళాకారుడిగా తనను పూర్తిగా మార్చేశాయని కార్తిక్ సుబ్బరాజు తెలిపారు. తాను ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాల్లో ఇదే అత్యంత రియాలిటీకి దగ్గరగా ఉండే, భావోద్వేగాలతో కూడిన కథ అని చెప్పారు. ఈ కథ 90వ దశకంలో జరిగిన అనేక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. దీన్ని మెయిన్‌స్ట్రీమ్‌కు తీసుకురావాలని అనుకున్నప్పుడు ఏ నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నారు? అని చాలా మంది తనను ప్రశ్నించినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆ ప్రశ్నకి అప్పడూ, ఇప్పుడూ తన సమాధానం ఒక్కటేనని.. అదే ప్రేక్షకులపై తనకు ఉన్న నమ్మకం అని ఆయన స్పష్టం చేశారు. చిన్నపిల్లవాడు తాను వేసిన మొదటి పెయింటింగ్‌ను తన తల్లిదండ్రులకు చూపించినట్లుగా, తమ టీమ్ ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలని, ఇది కచ్చితంగా మీ డబ్బుకు, సమయానికి తగిన విలువ ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, సినిమా చూసేముందు స్పాయిలర్స్ చదవవద్దని, చూశాక కూడా సోషల్ మీడియాలో క్లిప్స్ లేదా స్పాయిలర్స్ పోస్ట్ చేసి ఇతరుల అనుభూతిని పాడు చేయవద్దని కోరారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటించగా, సనాంత్ సుబ్బు పాత్రలో, రిషికాంత్ కార్తి పాత్రలో, ముత్తుకుమార్ వీరయ్య పాత్రలో కనిపించారు.
To My Dear Audience,
It’s #DorothyDay and though it’s my 10th film, am as excited and nervous as i was on the day of release of my first film Pizza. The days i have spent making this film have changed me as a person, as a filmmaker , as an artist , as a human. This film is the… pic.twitter.com/oYfTV3gVDD
— karthik subbaraj (@karthiksubbaraj) September 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

