డెహ్రాడూన్: జ్యోతిర్లంగ క్షేత్రం కేదార్నాథ్(Kedarnath)కు భక్తులు తాకిడి పెరిగింది. అలాగే ఆ ఆలయం వద్ద జమ కూడుతున్న వ్యర్థాలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. గడిచిన 5 నెలల్లోనే కేదార్నాథ్ వద్ద సుమారు 50.30 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు జనరేట్ అయినట్లు గుర్తించారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యనే ఆ స్థాయిలో వ్యర్థాలు ఉన్నాయి. ఇది గత ఏడాది సీజన్‌తో పోలిస్తే రెండున్నర రెట్లు ఎక్కువ అని తేల్చారు. అమిత్ గుప్తా అనే ఆర్టీఐ కార్యకర్త వేసిన ప్రశ్నకు స్థానిక గ్రామ పంచాయతీ ఈ సమాధాన్ని చెప్పింది.
2023లో 32.58 మెట్రిక్ టన్నులు, 2024లో 26.10 మెట్రిక్ టన్నులు, 2025లో 21.40 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు జనరేట్ అయినట్లు నగర పంచాయతీ పేర్కొన్నది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే, గత అయిదు నెలల్లోనే అధిక స్థాయిలో వ్యర్థాలు జమ అయినట్లు తేల్చారు. ఓ నివేదిక ప్రకారం ఈ ఏడాది కేదార్‌నాథ్‌లో ఇప్పటి వరకు 20 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు జనరేట్ అయినట్లు తెలుస్తోంది. దీంట్లో 18.5 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను ప్రాసెస్ చేశారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 15 లక్షల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించారు.