Asian Games 2026: షూటింగ్లో గోల్డ్.. సురుచి, కమల్జీత్ జోడికి పతకం
Asian Games 2026: ఆసియా క్రీడల్లో.. భారత షూటర్లు అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో సురుచి, కమల్జీత్ జోడికి స్వర్ణ పతకం దక్కింది. ఆ జోడి 484.6 పాయింట్లతో ఆ ఈవెంట్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో ఆ పతకం దక్కింది.
నగోయా: జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games 2026).. భారత షూటర్లు సూపర్ షో కనబరుస్తున్నారు. భారత షూటర్లు ఇవాళ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో సురుచి, కమల్జీత్ జోడికి స్వర్ణ పతకం దక్కింది. ఆ జోడి 484.6 పాయింట్లతో ఆ ఈవెంట్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్డ్ రికార్డుకు నాలుగు పాయింట్ల దూరంలో నిలిచిపోయారు. భారతీయ జోడి ఆరంభం నుంచి దూకుడును చూపింది. అయితే ఈవెంట్ మొత్తం తమ ఆధిపత్యాన్ని నిలకడగా ప్రదర్శించారు.
దక్షిణ కొరియా తీవ్ర వత్తిడి పెంచుతున్నా.. భారత ఎయిర్ పిస్తోల్ షూటర్లు మాత్రం మెరుగ్గా రాణించారు. 6.6 పాయింట్ల తేడాతో ఆధిక్యాన్ని ప్రదర్శించి.. చివరకు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. దక్షిణ కొరియా 478.0, ఇరాన్ 415.8 పాయింట్లతో రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.
ఇక షూటింగ్లో సిల్వర్ మెడల్ కూడా దక్కింది. మెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్లో ఆ పతకం దక్కింది. ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమార్, నిరాజ్ కుమార్, రుద్రాంన్క్ష్ పాటిల్ ఆ టీమ్‌లో ఉన్నారు. ఇక స్క్వాష్ ఈవెంట్లో జోషానా చిన్నప్ప, వెలావన్ సెంథిల్‌కుమార్ జోడికి కనీసం బ్రాంజ్ మెడల్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
🥇 GOLD FOR INDIA! 🇮🇳🎯🔥
Kamaljeet & Suruchi Singh win GOLD in the 10m Air Pistol Mixed Team event at #AsianGames2026!
🏆 Asian Games Champions!
🇮🇳 Second GOLD for Team India!#TeamIndia #Shooting #AsianGames2026 #IndiaSportsHub https://t.co/1PJL6JBzsd pic.twitter.com/tPPb4nGG8T— IndiaSportsHub (@IndiaSportsHub) September 25, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

