Team India : లార్డ్స్ టెస్టులో ఘన విజయంతో జోరు మీదున్న భారత మహిళల జట్టు మళ్లీ బిజీ కానుంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. అయితే.. ముందుగా అనుకున్న వన్డేలు, ఏకైక టెస్టుకు అదనంగా టీ20 సిరీస్‌ను చేర్చింది క్రికెట్ సౌతాఫ్రికా. ఈ విషయాన్ని గురువారం సఫారీ బోర్డు అధికారికంగా వెల్లడించింది. పటిష్టమైన టీమిండియాతో మూడు ఫార్మాట్ల సిరీస్ నిర్వహించడం తమ దేశ క్రికెట్‌కు మరింతగా ఉపయోగపడుతుందని సీఎస్ఏ భావిస్తోంది.
డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడనుంది. తొలుత బీసీసీఐ, సీఎస్ఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏకైక టెస్టు, ఆపై వన్డే సిరీస్‌తో పర్యటన ముగియాలి. కానీ, ఈ రెండు ఫార్మట్లకు అదనంగా టీ20 సిరీస్‌ను కలిపింది క్రికెట్ దక్షిణాఫ్రికా. బీసీసీఐ అందుకు అమోదించడంతో ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది సీఎస్ఏ. భారత జట్టుతో మ్యాచ్‌లకు ప్రేక్షకాదరణ నేపథ్యంలో మూడు టీ20ల సిరీస్‌ను ఆడించాలని నిర్ణయించింది ఆ దేశ బోర్డు. దాంతో, వన్డే సిరీస్ అనంతరం పొట్టి క్రికెట్లో తలపడనున్నాయి ఇరు జట్లు.
STORY | CSA include 3 T20Is to India women’s tour of South Africa
The Cricket South Africa on Thursday revised the schedule of India women’s team tour later this year to accommodate three T20Is in addition to a Test and three ODIs.
READ: https://t.co/LbTijNPZVl pic.twitter.com/4yxm19XzAM
— Press Trust of India (@PTI_News) August 6, 2026
ఏకైక టెస్టు – డిసెంబర్ 9-12 సెయింట్ జార్జ్ పార్క్- ఉదయం 10 గంటలకు
తొలి వన్డే – డిసెంబర్ 16 బొలాండ్ పార్క్. ఉదయం 10 గంటలకు
రెండో వన్డే – డిసెంబర్ 19 న్యూలాండ్స్ క్రికెట్ మైదానం – మధ్యాహ్నం 2 గంటలకు
మూడో వన్డే – డిసెంబర్ 22 మంగాంగ్ ఓవల్ – మధ్యాహ్నం 2 గంటలకు
తొలి టీ20 – డిసెంబర్ 26 విల్లొమూరే పార్క్ – సాయంత్రం 6 గంటలకు
రెండో టీ20 – డిసెంబర్ 29 ఎన్డబ్ల్యూసీ ఓవల్ – సాయంత్రం 6 గంటలకు
మూడో టీ20 – డిసెంబర్ 30 – ఎన్డబ్ల్యూసీ ఓవల్ – సాయంత్రం 6 గంటలకు