(Jagan on OTS) అమరావతి : వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పూర్తిగా స్వచ్ఛందమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఓటీఎస్ పథకం ద్వారా అన్నిరకాల సంపూర్ణ హక్కులూ ఇంటి యజమానులకు లభిస్తాయని తెలిపారు. బుధవారం గృహనిర్మాణపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఓటీఎస్‌పై విపక్షాల రాద్ధాంతాన్ని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నేతలు ప్రతి పథకంలో చేసినట్లుగానే ఇందులో కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. వారిని పట్టించుకోకుండా ఓటీఎస్ అమలుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
పేదలపై రూ.10 వేల కోట్ల రుణభారాన్ని తగ్గించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ఓటీఎస్‌ను తీసుకొచ్చామని వైఎస్ జగన్ తెలిపారు. ఈ పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, అర్థం చేయించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. రుణాలు మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని లబ్దిదారులకు వివరించి వారిలో ఉన్న అపోహలను తొలగించాలని సూచించారు. ఓటీఎస్ ద్వారా సంపూర్ణ హక్కులు దక్కుతాయని అన్నారు. డిసెంబరు 21 నుంచి రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తామని జగన్ చెప్పారు. భవిష్యత్‌లో గ్రామ సచివాలయాల్లోనూ ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వెల్లడించారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..