Motilal | న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ గడ్డ నుంచి చెబుతున్నా.. ఈ ఢిల్లీ సాక్షిగా.. నువ్వు మోకాళ్ల మీద కూర్చొని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పే రోజు తీసుకువస్తామని మోతీలాల్ తేల్చిచెప్పారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. ఈ దీక్ష వేదిక నుంచి మోతీలాల్ మీడియాతో మాట్లాడారు.
మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ్నుంచి కదలం. రోజురోజుకు మా సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నీ ప్రభుత్వం మెడలు వంచి తగిన బుద్ది చెప్పకపోతే మేం నిరుద్యోగులమే కాదు. నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తాం. రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్‌ను అధఃపాతాళానికి తొక్కుతాం అని మోతీలాల్ హెచ్చరించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చాలని వివిధ మార్గాల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. నిరుద్యోగులు దీక్షలు, ధర్నాలు చేపట్టారు. నేను కూడా తొమ్మిది రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. అయినా ప్రభుత్వం స్పందించలేదు. టీజీపీఎస్సీ ముట్టడించాం.. అయినా కదలిక లేదు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి.. నిరసనలు తెలుపుతున్న నిరుద్యోగులపై లాఠీలు ఝులిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. చివరకు కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు చేయి చేసుకున్నారు. ప్రజా పాలన అని చెబుతూ అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసులు అరాచకాలు సృష్టించారు. చివరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగినం. తెలంగాణలో అయితే పోలీసులతో మన ఉద్యమాలను నియంత్రిస్తారు. మీడియాను అడ్డుకుంటారు. మనల్ని హాస్టళ్ల నుంచి బయటకు రానివ్వరు. జంతర్ మంతర్ వద్ద మనం నిరసన తెలిపితే.. తెలంగాణ ప్రభుత్వ అరాచకాలు దేశం మొత్తానికి తెలుస్తాయని మోతీలాల్ పేర్కొన్నారు.
నిరుద్యోగుల సమస్యలపై సోయిలేని రేవంత్ రెడ్డి నా క్యారెక్టర్‌ను అవహేళన చేశారు. నేను గ్రూప్ -1, 2, 4 పరీక్షలను రాశాను. కావాలంటే ఆధారాలు ఇదిగో.. గ్రూప్-1 ఎగ్జామ్ రాయకపోతే హాల్ టికెట్‌పై సంతకం ఎలా చేస్తారు సన్నాసి..? రంగులు పూయడం నీకు అలవాటు ఉంది.. మాకు రంగులు పూయడం అలవాటు లేదు. మా వెనుకాల ఏ పార్టీ రాజకీయ నాయకుడు లేడు. కడుపు మంట మండి 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి, రాస్తారోకోలు నిర్వహించి, టీజీపీఎస్సీ, డీఎస్సీ కార్యాలయాన్ని ముట్టిడి చేశాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో కడుపు మంటతో ఢిల్లీకి వచ్చి దీక్ష చేస్తున్నాం అని మోతీలాల్ స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు న్యాయం జరగాలి. ఇవాళ తెలంగాణలో 34 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారి సమస్యలు పట్టించుకోకుండా నిరుద్యోగులు ముదిరిపోయిన బెండకాయలు అని మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులు నిరసనలు చేయట్లేదు అంటున్నరు. నిరుద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో.. రాహుల్ గాంధీకి కూడా అంతే బాధ్యత ఉంది. రాహుల్ గాంధీ ఇంటిని తప్పకుండా ముట్టడిస్తాం. నిరుద్యోగుల ఓట్ల కోసం చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడిన సన్నాసి రాహుల్ గాంధీ. మేం డిల్లీకి వచ్చి దీక్ష చేస్తున్నప్పటికీ రాహుల్ గాంధీకి కనువిప్పు కలగడం లేదు. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన హామీలనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుల ఉద్యమం పతాకస్థాయికి చేరుకునే సరికి ఏదో రకంగా నీరుగార్చుతున్నారు రేవంత్ రెడ్డి. మనలో మనకే గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుండు. టీజీపీఎస్సీ ముట్టడి రోజు గ్రూప్స్ పోస్టుపోన్ చేస్తామని ప్రకటించి మోసం చేశాడు. మళ్లీ ఇప్పుడేమో మంత్రులకు ప్రతిపాదనలు ఇవ్వండంటూ మరోసారి మోసం చేసేందుకు రేవంత్ యత్నిస్తున్నాడని మోతీలాల్ మండిపడ్డారు.
ఢిల్లీ గడ్డ మీద తెలంగాణ పౌరుషం చాటుతున్న తమ్ముడు మోతీలాల్ కు హ్యాట్సాఫ్.
We are with you Motilal. Go Ahead. pic.twitter.com/SKItxhFORl
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) July 16, 2024
ఇవి కూడా చదవండి..
Kavitha | తిహార్ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. డీడీయూ ఆసుపత్రికి తరలింపు..!
KTR | పార్టీ మారండి.. లేదంటే ప్రాణగండం ఉందని ఎమ్మెల్యేలకు డీఎస్పీలు బెదిరింపులు : కేటీఆర్
KCR | కేసీఆర్ దెబ్బ.. విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నరసింహా రెడ్డి
KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు.. మండిపడ్డ కేటీఆర్
KTR | సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి : కేటీఆర్
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు
Rythu Runa Mafi | ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే.. ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం
Rythu Runa Mafi | సందేహాలెన్నో.. స్పష్టతే లేదు.. రుణమాఫీ మార్గదర్శకాలతో గందరగోళం