KTR | హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పార్టీ ఫిరాయింపుల అంశంలో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఇదే విషయాన్ని స్పీకర్ గారికి గుర్తు చేశాం అని ఆయన తెలిపారు. అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను కూడా స్పీకర్‌కు అందించాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి విషయంలో మూడు నెలల్లోనే చర్యలు తీసుకోవాలని 2020, జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును స్పీకర్‌కు అందించాం. ఆ తీర్పును అనుసరించి మణిపూర్‌లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్‌పై అక్కడి స్పీకర్ అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించాం. లేదంటే స్పీకర్ పదవికి అగౌరవం వచ్చే పరిస్థితి ఉందని చెప్పామని కేటీఆర్ తెలిపారు.
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను కూడా చదివి స్పీకర్‌కు వినిపించాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఐదేండ్ల కాలపరిమితిలో ఉండే ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే.. మూడు నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మణిపూర్‌లో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం ఇచ్చింది. ఇక్కడ కూడా ఆ పరిస్థితి వస్తుందన్నారు. మార్చి 18న దానం నాగేందర్ పిటిషన్ ఇచ్చాం. ఇవాళ 9 మంది పిటిషన్లు స్పీకర్ చేతికి అందించాం. 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోండి అని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే పరిస్థితిని తీసుకురావొద్దని చెప్పాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు
Rain Alert | హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
Jampanna vagu | ములుగు జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు
KTR | సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయండి: కేటీఆర్
Rythu Runa Mafi | ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే.. ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం
Rythu Runa Mafi | సందేహాలెన్నో.. స్పష్టతే లేదు.. రుణమాఫీ మార్గదర్శకాలతో గందరగోళం