అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
అగ్రి వర్సిటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అగ్రివర్సిటీ కళాశాల ఆవరణలో విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.
- అగ్రి వర్సిటీ విద్యార్థుల దీక్షకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ మద్దతు
వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 13: అగ్రి వర్సిటీ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అగ్రివర్సిటీ కళాశాల ఆవరణలో విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు.
విద్యార్థులు అధైర్యపడవద్దని..అండగా ఉంటామని అభయమిచ్చారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. రెండింతలు ైస్టెఫండ్ పెంచుతామని చెప్పారు. అనంతరం విద్యార్థి నాయకులను ఫోన్లో కేటీఆర్‌తో మాట్లాడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థులకు భరోసానిచ్చారు. యూనివర్సిటీ పరిపాలన నుంచి పీజీ, పీహెచ్డీ విద్యార్థుల ైస్టెఫండ్ పెంపును ఆమోదించి..అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వ అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.
విద్యార్థి నేత రాజ్ కుమార్, యూనివర్సిటీ స్కాలర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శి మనోజ్ కుమార్ గౌడ్, లోకేశ్ ముదిరాజ్, వర్కింగ్ కమిటీ సభ్యులు మౌనిక, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. దీక్షకు కళాశాల విద్యార్థులతో పాటు , ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. అంతకుముందు కళాశాల మూడో అంతస్తుకు విద్యార్థి నాయకులు చేరుకొని ‘మా చావుతోనైనా..వర్సిటీ సమస్యలు పరిష్కరించాలి’ అని నినాదాలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

