Telangana | న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. విచారణ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ విచారణ చేపట్టారు. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని సీజేఐ తప్పుబట్టారు. ప్రెస్మీట్లో అభిప్రాయాలు వ్యక్తపరచడం సరికాదని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు నూతన చైర్మన్ పేరును చెప్తామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ, సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ట్రిబ్యునల్స్ ఉండగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు చేశాం. మార్కెట్ రేట్ కంటే తక్కువగా, మేము యూనిట్ 3.90 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేశాం. నేను మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడున్న సీఎం ఈ అంశంపై అనేక ఆర్టీఐ వేశారు. ఇది కక్ష సాధింపు చర్య. విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారు. ఈఆర్సీ ఉండగా, మళ్లీ విచారణ కమిషన్ అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో టెండర్లు లేకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వము నుంచే విద్యుత్ కొనుగోలు చేశాం. ప్రభుత్వ సంస్థల ద్వారానే భద్రాద్రి థర్మల్‌కు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడాము అని కోర్టుకు ముకుల్ రోహత్గీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Rain Alert | హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
Jampanna vagu | ములుగు జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు
KTR | సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయండి: కేటీఆర్
Rythu Runa Mafi | ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే.. ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం
Rythu Runa Mafi | సందేహాలెన్నో.. స్పష్టతే లేదు.. రుణమాఫీ మార్గదర్శకాలతో గందరగోళం