మద్యం అలవాటు లేకున్నా
మద్యం తాగితే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతారు. అయితే, కొందరిలో మద్యం అలవాటు లేకున్నా.. లివర్ దెబ్బతింటున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మద్యం తాగితే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతారు. అయితే, కొందరిలో మద్యం అలవాటు లేకున్నా.. లివర్ దెబ్బతింటున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆల్కహాల్‌ను దూరం పెట్టినా.. కొందరు ఆహారంపై నియంత్రణ పాటించలేరు. అతిగా వేయించిన ఆహార పదార్థాలు, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు. ఇలాంటివారిలో కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ లేకపోయినా, అధిక బరువు ఉన్నా.. కాలేయంపై ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇక కొందరు ఏ వైద్యులను సంప్రదించకుండానే దీర్ఘకాలిక మందులు తీసుకుంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి.. అందులోనూ కాలేయానికి ఏమాత్రం మంచిదికాదు. ఇవేకాకుండా, వైరల్ ఇన్ఫెక్షన్లు, కలుషిత నీటితో వ్యాపించే వ్యాధులు, మానసిక ఒత్తిడి, అపసవ్య జీవనశైలి, నిద్రలేమి లాంటి సమస్యలు.. కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కొందరిలో కుటుంబ చరిత్ర, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కాలేయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
అయితే, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. ఇంటి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. వేయించిన, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పక్కన పెట్టాలి. నడక లాంటి తేలికపాటి వ్యాయామం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా, పుష్కలంగా నీరు తాగాలి. సమయానికి భోజనం చేయాలి. ఇలా మంచి ఆహారం, మంచి జీవనశైలితో.. కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవడం మానుకోవాలి. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Alcohol
- drinking alcohol
- liver
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

