Kavitha | నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. మద్యం పాలసీ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. జైలు అధికారులు ఆమెను వెంటనే ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కవిత అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లుగా సమాచారం. లిక్కర్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో ఆమెను ఈడీ మార్చి 15న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నెల రోజుల తర్వాత కవితను తిహార్ జైలులోనే సీబీఐ అరెస్టు చేసింది. కవిత ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది.