– రెండోరోజు కొనసాగిన 12, 14 టైర్ల టిప్పర్ల ఓనర్ల నిరసన
టేకులపల్లి, ఫిబ్రవరి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గని నుండి నవభరత్, బీపీఎల్ కు బొగ్గు రవాణా చేస్తున్న 12, 14 టైర్ల లారీ ఓనర్లు 16 టైర్ల లారీల వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు సమీపంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద 12, 14 టైర్ల లారీల ఓనర్లు లారీలను నిలిపి బుధవారం రెండో రోజు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లారీ ఓనర్లు, డ్రైవర్లు మాట్లాడుతూ… గతంలో మాదిరిగానే 12, 14 టైర్ల లారీలను మాత్రమే నవభరత్, బీపీఎల్ కు వెళ్లే విధంగా చూడాలన్నారు. 16 టైర్ల బండ్లు వస్తే ఎక్కువ టన్నుల బొగ్గు వారికి లోడ్ అవుతుందని, తద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 16 టైర్ల లారీల ద్వారా సవభరత్, బిపిఎల్ కు బోగ్గు లోడ్ ఇస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, లారీలకు ఈఎంఐ కట్టే పరిస్థితి కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. 16 టైర్ల బండ్లను ఇల్లెందుకు చెందిన ఓ కాంట్రాక్టర్ తీసుకురావడంతో తమకు అన్యాయం జరుతుందని, ప్రజా ప్రతినిధుల సహకారం తనకే ఉందని అంటున్నడని వారు ఆరోపించారు. దీంతో లారీల ఓనర్లకు ఉరితాడు అవుతుందని, కుటుంబాలు ఇబ్బందుల పాలవుతామన్నారు. గతంలో లానే లారీలను నడిపి తమకు ఇల్లెందు ఎమ్మెల్యే న్యాయం చేయాలని కోరారు.

‘ఆ లారీలతో తమకు తీవ్ర అన్యాయం’