Chennai Love Story | చెన్నై లవ్‌స్టోరీ రివ్యూ: కిరణ్ అబ్బవరం క్లాసిక్ హిట్ కొట్టాడా?
Chennai Love Story | కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్‌స్టోరీ' ఫస్ట్ గ్లింప్స్ నుంచే సినిమాపై ఆసక్తిని పెంచించింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? ఈ ప్రేమకథలో ఉన్న కొత్తదనం ఏమిటి? రివ్యూలో చూద్దాం.
Chennai Love Story | కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఫస్ట్ గ్లింప్స్ నుంచే సినిమాపై ఆసక్తిని పెంచించింది. తొలిప్రేమ గురించి చెప్పే సంభాషణలు ఉత్సాహాన్ని పెంచాయి. ‘కలర్ ఫోటో’, ‘బేబీ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ ఇవ్వడం, ఈ సినిమా క్లాసిక్ అవుతుందనే కోణంలో చేసిన ప్రచారం… ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? ఈ ప్రేమకథలో ఉన్న కొత్తదనం ఏమిటి? రివ్యూలో చూద్దాం.
కథ గురించి:
ప్రేమించిన వ్యక్తి పెళ్లి మండపంలోనే మోసం చేయడంతో నివి (శ్రీ గౌరీ ప్రియ) కుంగిపోతుంది. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి అడుగుపెట్టిన స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) మళ్లీ ప్రేమ, జీవితంపై ఆశలు చిగురించేలా చేస్తాడు. ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారుతుంది. కానీ విధి ఈ ప్రేమకథను ఊహించని మలుపు తిప్పుతుంది. ఏమిటా మలుపు? ఈ కథకు ఎలాంటి ముగింపు దొరికిందన్నదే ‘చెన్నై లవ్ స్టోరీ’ కథ.

Chennai Love Story1
విశ్లేషణ:
ప్రేమకు ఫాంటసీ జోడించిన కథ ఇది. ప్రేమలో విఫలమై దేవదాసులా మారిన కథానాయిక కోణంలో కథను ప్రారంభించడం తొలి సగానికి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. స్టీవెన్ శంకర్ నివి జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇద్దరి మధ్య పెరిగే అనుబంధం, ప్రేమ సహజంగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ద్వితీయార్ధంలో దర్శకుడు కథను పూర్తిగా ఫాంటసీ వైపు మళ్లిస్తాడు. అది ఇదివరకే వచ్చిన ‘ఎందుకంటే… ప్రేమంట!’ సినిమాను గుర్తు చేసినా, ‘చెన్నై లవ్‌స్టోరీ’ ఆత్మ వేరు. హీరో పాత్రలో వచ్చే జెలసీ కావాల్సిన వినోదాన్ని పంచుతుంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ హత్తుకునేలా ఉంటాయి. ప్రేమ విషయంలో రెండు పాత్రల మధ్య కాస్త గందరగోళం ఏర్పడినప్పటికీ, ఈ సినిమాకు దర్శకుడు ఇచ్చిన క్లైమాక్స్ హత్తుకునేలా ఉంటుంది.
నటన గురించి:
స్టీవెన్ శంకర్ పాత్రలో కిరణ్ అబ్బవరం చూపించే అమాయకత్వం, చలాకీతనం సహజంగా ఉంటాయి. చాలా ఎమోషన్ ఉన్న పాత్ర ఇది. దర్శకుడు కావాలనే తన కల, అలాగే నివితో ప్రేమ, తను అనాథ అనే భావం.. ఇవన్నీ సహజంగా పలికించాడు. నివి పాత్రలో శ్రీగౌరీ ప్రియ ఈ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది. ఆమె నటన చాలా హుందాగా ఉంది. ఈ జోడీ తెరపై అందంగా కనిపించింది. త్రిగుణ్ తన కీలకమైన పాత్రకు న్యాయం చేయగా, మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

Chennai Love Story3
టెక్నికల్‌గా:
దర్శకుడు రవి నంబూరి సాయి రాజేశ్ కథలోని భావోద్వేగాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. సాంకేతికంగా మణిశర్మ సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. ‘గుర్తుందా’, ‘వదలనే’ పాటలు చక్కగా కుదిరాయి. విశ్వాస్ డేనియల్ ఛాయాగ్రహణం, చెన్నై వాతారవణం, వర్షం, కొన్ని క్లాసిక్ సినిమాలని గుర్తు చేసే ఫ్రేమ్స్, ఉన్నతమైన నిర్మాణ విలువలు సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
ప్లస్ పాయింట్స్
+ కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ నటన
+ ఫస్ట్ హాఫ్
+ మ్యూజిక్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
– సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
ఓవరాల్‌గా చూసుకుంటే ‘చెన్నై లవ్ స్టోరీ’ ఫాంటసీ ఎలిమెంట్‌తో ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా అలరిస్తుంది.
రేటింగ్: 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

