Bobby deol | నాతో నటించిన హీరోలంతా రాజకీయ నేతలే .. బాబీ డియోల్ సరదా వ్యాఖ్యలు వైరల్
Bobby deol | బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. హీరోగా కాకుండా విలక్షణమైన ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో పవర్ఫుల్ విలన్‌గా మెప్పిస్తున్న ఆయన, తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Bobby deol | బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. హీరోగా కాకుండా విలక్షణమైన ప్రతినాయక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా వరుస అవకాశాలను అందుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో పవర్ఫుల్ విలన్‌గా మెప్పిస్తున్న ఆయన, తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాబీ డియోల్.. తనతో కలిసి నటించిన దక్షిణాది స్టార్ హీరోలు రాజకీయాల్లోనూ అద్భుత విజయాలు సాధిస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. నాతో కలిసి నటించిన సౌత్ హీరోలంతా రాజకీయాల్లోకి వెళ్లి మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా, సరదాగా అనిపిస్తుంది అంటూ నవ్వుతూ చెప్పారు.
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయాన్ని గుర్తు చేసుకున్న బాబీ.. బాలకృష్ణ చాలా కాలంగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ ప్రజల మద్దతుతో వరుస విజయాలు సాధించడం అభినందనీయమని అన్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి హరిహర వీరమల్లు సినిమాలో నటించడం మంచి అనుభవమని చెప్పారు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషమని పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి నటించిన జన నాయగన్ సినిమా గురించి కూడా ఆయన ప్రస్తావించారు. విజయ్ చాలా సింపుల్ వ్యక్తి అని, ప్రచారం చేసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదని చెప్పారు. అలాంటి వ్యక్తి ప్రజల మద్దతుతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడం గొప్ప విషయమని ప్రశంసించారు.
తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి చేసిన కంగువా సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, ఆ చిత్రంలో పనిచేయడం తనకు మంచి అనుభవంగా మిగిలిపోయిందని బాబీ డియోల్ తెలిపారు. తన వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దని కూడా బాబీ డియోల్ స్పష్టం చేశారు. ఇవన్నీ సరదాగా చెప్పిన మాటలేనని, ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో బిజీ విలన్‌గా కొనసాగుతున్న బాబీ డియోల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “బాబీతో నటిస్తే రాజకీయాల్లో విజయం ఖాయం” అంటూ అభిమానులు కూడా సరదాగా కామెంట్లు చేస్తూ ఈ ఇంటర్వ్యూను ట్రెండ్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Alia Bhat
- animal
- Bobby Deol
- Pawan
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

