న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) నిరాహార దీక్ష విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన దీక్ష విరమిస్తున్నట్లు చెప్పారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ను గురువారం అర్థరాత్రి ఇద్దరు మంత్రలు కలిశారు. నీట్ పేపర్ లీకేజీ కేసులు అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చిన తర్వాత వాంగ్‌చుక్ దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. 26 రోజుల నుంచి వాంగ్‌చుక్ ఆమరణ దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో గురువారం హోంశాఖ మంత్రి అమిత్ షా సుమారు 4 గంటల పాటు చర్చించారు. ఆ తర్వాత మంత్రుల బృందం.. ఆస్పత్రిలో వాంగ్చుక్ను కలిసింది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి మద్దతుగా వాంగ్‌చుక్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
#WATCH | Activist Sonam Wangchuk breaks his hunger strike in the presence of Union Health Minister JP Nadda and Minister of State for the Prime Minister’s Office, Dr Jitendra Singh, at the Medanta hospital.
(Source: BJP) pic.twitter.com/pDAXlJKttE
— ANI (@ANI) July 24, 2026
నీట్ పేపర్ లీకేజీపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం చెబుతూ ఉన్నది. కానీ విపక్షాలు మాత్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుపడుతున్నాయి. ప్రధాని మోదీ కూడా గురువారం రాత్రి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. శుక్రవారం పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. మరో వైపు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని తొలగించారు. వాంగ్‌చుక్ తీసుకున్న నిర్ణయాన్ని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే వెల్కమ్ తెలిపారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయనున్నట్లు చెప్పారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ దీక్ష కొనసాగుతుందన్నారు.
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026