రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో..
నీలగిరి, ఫిబ్రవరి 25 : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. “డ్రైవర్‌కు కంటి చూపు సరిగ్గా లేకపోతే అది ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుందన్నారు. ప్రతి డ్రైవర్ నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకసారి అయినా కంటి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇది తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే చర్య అని పేర్కొన్నారు.
అలాగే రోడ్డు ప్రమాదాలు నివారణ గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు భద్రత నియమాలను పైన అవగాహన లోపం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన వ్యక్తులను ప్రాథమిక చికిత్స నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్లు సీపీఆర్ పైన అవగాహనా కల్పించారు. “సురక్షిత ప్రయాణం – సంతోషకర గమ్యం” అనే లక్ష్యంతో అందరూ కలిసి పని చేయాలని ఎస్పీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరం రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడుపుతూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, ఎస్బి సీఐ రాము, మిర్యాలగూడ రూరల్ సీఐ పిఎన్డి ప్రసాద్, మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణ, డిటిఅర్బి రిటైర్ సీఐ అంజయ్య, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏంపిడిఓ, ఎమ్మార్వో, వైద్య బృందం, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

