KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు.
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో ఉన్న డీఎస్సీలు ఫోన్ చేసి పార్టీ మారండి.. లేదంటే ప్రాణగండం ఉందని బెదిరించారు. ఇంకా కొందరిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిని తెలంగాణలో చేస్తోంది. వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటని అడిగితే సమాధానం లేదు. కానీ సేమ్ అదే పని తెలంగాణలలో చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే వారి సొంత ఆస్తులను ధ్వసం చేస్తున్నారు. విజిలెన్స్ దాడులతో బెదిరిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.
బడే భాయ్ – చోటే భాయ్‌కి తేడా ఏం లేదు. ఢిల్లీలో బడే భాయ్ నరేంద్ర మోడీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగానే… ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని మా ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద మాకు సానుభూతి ఉంది. ఎందుకంటే వారికి వారే ఆత్మహత్య చేసుకున్నారు. వారిని ఎవరూ కాపాడలేరు. ప్రజలు తప్పకుండా శిక్షిస్తారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయనడానికి ఇదే ఉదాహరణ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | కేసీఆర్ దెబ్బ.. విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నరసింహా రెడ్డి
KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు.. మండిపడ్డ కేటీఆర్
KTR | సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి : కేటీఆర్
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు
Rain Alert | హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
Jampanna vagu | ములుగు జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు
KTR | సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయండి: కేటీఆర్
Rythu Runa Mafi | ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే.. ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం
Rythu Runa Mafi | సందేహాలెన్నో.. స్పష్టతే లేదు.. రుణమాఫీ మార్గదర్శకాలతో గందరగోళం