KTR | హైదరాబాద్ : రాజ్యాంగాన్ని కాపాడుతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు కొడుతున్నారు.. కానీ మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని పార్లమెంటులో ఫోజులు కొడుతున్నారు నేను రాజ్యాంగ సంరక్షుడిని అని.. బయటికి వచ్చేమో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన తెలంగాణ ఎమ్మెల్యేలకు వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారు. హర్యానాలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరితే.. అతని సభ్యత్వం రద్దు చేయాలని కొట్లాడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ రూ. 50 కోట్లకు కొనుగోలు చేస్తుందని సీఎం సిద్ధరామయ్య చెప్పారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడొద్దని ఇదే రాహుల్ గాంధీ గోవాలో కాంగ్రెస్ అభ్యర్థలుతో శపథం చేయించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. అక్కడ అసెంబ్లీ స్పీకర్ డిస్ క్వాలిఫై చేస్తే.. సుప్రీంకోర్టు కూడా మేం అడ్డురామని చెప్పింది. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది. సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని కేటీఆర్ పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం అని మాట్లాడారు.. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కార్యాచరణలోకి తీసుకుని 10 మందిని అనర్హులుగా ప్రకటించాలని కోరాం. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ గారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి : కేటీఆర్
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు
Rain Alert | హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
Jampanna vagu | ములుగు జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు
KTR | సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయండి: కేటీఆర్
Rythu Runa Mafi | ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే.. ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం
Rythu Runa Mafi | సందేహాలెన్నో.. స్పష్టతే లేదు.. రుణమాఫీ మార్గదర్శకాలతో గందరగోళం