హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనసభలో ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్)పై స్వల్పకాలిక చర్చ జరుగనున్నది. అదేవిధంగా శాసనమండలిలో పలు బిల్లులపై చర్చించనున్నారు. డిసెంబర్ 29న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా, ఎజెండాను ముందస్తుగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అధికారులు వెల్లడించలేదు. ప్రభుత్వ, అధికారుల పనితీరును శనివారం ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్, పలువురు సభ్యులు తప్పుపట్టారు. దీంతో ఎట్టకేలకు అసెంబ్లీ సిబ్బంది సోమవారం ఎజెండాను ముందుగానే ప్రకటించారు.