Harish Rao | రూ. 2 లక్షలు దాటినా రుణాలకు.. అప్పు కట్టేందుకు అప్పు తెచ్చుకో అన్నట్లుంది : హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పంటల రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు లక్షలకు పైగా అప్పున్న రైతులు, ఆ అప్పును కడితేనే రుణమాఫీ చేస్తం అంటున్నారు. అంటే అప్పు మాఫీ కోసం బయట మూడు రూపాయలకు మళ్లా అప్పు తెచ్చుకునే పరిస్థితి. అప్పు కట్టేందుకు అప్పు తెచ్చుకో అన్నట్లుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పంటల రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు లక్షలకు పైగా అప్పున్న రైతులు, ఆ అప్పును కడితేనే రుణమాఫీ చేస్తం అంటున్నారు. అంటే అప్పు మాఫీ కోసం బయట మూడు రూపాయలకు మళ్లా అప్పు తెచ్చుకునే పరిస్థితి. అప్పు కట్టేందుకు అప్పు తెచ్చుకో అన్నట్లుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రైతుకు అప్పు ఎప్పుడు పుట్టాలి..? ఎప్పుడు కట్టాలి..? ఎప్పుడు మీరు జమ చేయాలి..? ఎంత ఆలస్యం జరుగుతుందో తెలుసా..? ఇలాంటి షరతులు అవసరం లేదు. మీరు ఇచ్చే రెండు లక్షల రుణమాఫీ చేయాలి. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందనడం దారుణం. అంటే దీర్గకాలిక పంటలకు లేదన్నట్లు.. బత్తాయి తోట, మామిడి తోట, ఫాం ఆయిల్ ఇలాంటి పంటలకు రుణమాఫీ లేదు. అంటే దాదాపు పది లక్షల ఎకరాలకు రుణమాఫీ లేనట్టే అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రీషెడ్యూల్ చేసుకున్న వారికి రుణాలు వర్తించవు అన్నారు. తీవ్రంగా రైతులు నష్టపోయినప్పుడు, కరువు పరిస్థితులు ఉన్నపుడు, వరదలు వచ్చి పంట పొలాలు కొట్టుకుపోయినప్పుడు రీషెడ్యుల్ చేస్తారు. నిజానికి వారే ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవారు. వారికి రుణమాఫీ లేదని చెప్పడం దుర్మార్గం. సకాలంలో తీసుకున్న అప్పులు కట్టిన వారికి మొండి చేయి చూపడం సరికాదు. దీన్ని కూడా ఆలోచించాలి. రైతును సానుభూతితో చూడాలి. రుణమాఫీ వారికి కూడా చేయాలని కోరుతున్నాం అని హరీశ్‌రావు చెప్పారు.
రుణమాఫీ అమలుకు స్టార్టింగ్ డేట్ ఉండదు.. ఎండింగ్ డేట్ ఉంటుంది. మేము అలాగే చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 12, 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటున్నారు. ఇలా కొందరు రైతులకు కోత పెట్టినట్లే కదా. ఇది తీవ్రమైన అన్యాయం. అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు మాఫీ చేస్తం అన్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తం అన్నారు. కానీ, 8 నెలల కాలానికి వడ్డీ ఎవరు భరించాలి. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రుణమాఫీ చేయాలి. అమలు చేసే దాకా అయ్యే వడ్డీని కూడా ప్రభుత్వమే భరించాలి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు ప్రామాణికం కాదు అన్నారు. నాలుగు రోజుల తర్వాత రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు. ఎన్నికల ముందు వడ్లకు బోనస్ ఇస్తాం అన్నారు. ఎన్నికల తర్వాత సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.. పది శాతం సన్నాలకు ఇచ్చి, 90శాతం రైతులకు పంగనామాలు పెడుతున్నరు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | పార్టీ మారండి.. లేదంటే ప్రాణగండం ఉందని ఎమ్మెల్యేలకు డీఎస్పీలు బెదిరింపులు : కేటీఆర్
KCR | కేసీఆర్ దెబ్బ.. విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నరసింహా రెడ్డి
KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు.. మండిపడ్డ కేటీఆర్
KTR | సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి : కేటీఆర్
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు
Rythu Runa Mafi | ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే.. ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం
Rythu Runa Mafi | సందేహాలెన్నో.. స్పష్టతే లేదు.. రుణమాఫీ మార్గదర్శకాలతో గందరగోళం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

