Harish Rao | బ్యాంకులు పాస్‌బుక్స్ చూసి రుణాలు ఇచ్చాయి.. రేషన్ కార్డులు చూసి ఇవ్వలేదు.. రేవంత్‌కు హరీశ్‌రావు చురకలు
Harish Rao | రాష్ట్రంలోని రైతులకు బ్యాంకులు పాస్‌బుక్స్ చూసి రుణాలు ఇచ్చాయి.. అంతేగాని రేషన్ కార్డులు చూసి రుణాలు ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చురకలంటించారు. రైతును రైతుగానే చూడాలని సూచించారు.
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులకు బ్యాంకులు పాస్‌బుక్స్ చూసి రుణాలు ఇచ్చాయి.. అంతేగాని రేషన్ కార్డులు చూసి రుణాలు ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చురకలంటించారు. రైతును రైతుగానే చూడాలని సూచించారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది. రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబంలో ఒక్కరికే రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి తప్పుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. రుణమాఫీ మార్గదర్శకాలపై హరీశ్‌రావు అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల ముందు కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అని, రేషన్ కార్డు ఉన్న వాళ్లకే అని చెబితే అయిపోవు కదా..? ఆ రోజు అందరిని ఉరుకుమన్నవ్, ఈ రోజు కొందరిని ఆగవడుతున్నవ్.. ఇది ఎక్కడి పద్ధతి..? బ్యాంకులు పాస్‌బుక్స్ చూసి రుణం ఇచ్చాయి అంతేగాని రేషన్ కార్డులు చూసి ఇవ్వలేదు. బ్యాంకులకు లేని షరతు, ప్రభుత్వానికి ఎందుకు..? రుణమాఫీ గైడ్ లైన్స్ గోల్డ్ ఇచ్చే వాటి కంటే దారుణంగా ఉన్నాయి. రేషన్ కార్డు షరతు తొలగించి, రుణాలు తెచ్చుకున్నందరికి రుణమాఫీ చేయాలి. గతంలో బీఆర్ఎస్ రుణమాఫీ చేసిన నాడు ఇలాంటి షరతులు మేం పెట్టలేదు. రైతులను రైతులుగా చూసి లక్ష రూపాయల రుణమాఫీ చేశామని హరీశ్‌రావు గుర్తు చేశారు.
పీఎం కిసాన్ డేటాను పరిగణలోకి తీసుకుంటాం అంటున్నారు. అంటే సగానికి సగం రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ఇది.
రైతుబంధు కింద 68,99,79 మంది రైతులు లబ్ధి పొందితే, 30 లక్షల 36 వేల మందికి పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందారు. పీఎం కిసాన్ పరిగణలోకి తీసుకోవడం అంటే 39 లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే. రైతు బంధు కింద ఏడాదికి రూ. 15,248 కోట్లు, పీఎం కిసాన్ కింద ఇచ్చేది రూ. 1821 కోట్లు. మెజార్టీ రైతులను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు ప్రధానమంత్రి ఇయ్యడు.. ఇటు ముఖ్యమంత్రి ఇయ్యడు. బడేబాయ్ బాటలో చోటే బాయ్ నడుస్తున్నడు. పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే 60 శాతం మంది రైతులను దూరం చేయడమే అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | పార్టీ మారండి.. లేదంటే ప్రాణగండం ఉందని ఎమ్మెల్యేలకు డీఎస్పీలు బెదిరింపులు : కేటీఆర్
KCR | కేసీఆర్ దెబ్బ.. విద్యుత్ ఒప్పందాలపై విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నరసింహా రెడ్డి
KTR | రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఢిల్లీలో ఫోజులు.. మండిపడ్డ కేటీఆర్
KTR | సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి : కేటీఆర్
BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌కు ఫిర్యాదు
Rain Alert | హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. జీహెచ్ఎంసీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం
Jampanna vagu | ములుగు జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తున్న జంపన్న వాగు
KTR | సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయండి: కేటీఆర్
Rythu Runa Mafi | ఉద్యోగులకు రుణమాఫీ లేనట్టే.. ప్రభుత్వ మార్గదర్శకాలతో 7 లక్షల కుటుంబాలకు నష్టం
Rythu Runa Mafi | సందేహాలెన్నో.. స్పష్టతే లేదు.. రుణమాఫీ మార్గదర్శకాలతో గందరగోళం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

