ఎస్సై సంతకం ఫోర్జరీ.. ఏఎస్సై అరెస్టు

ఆలేరు: ఓ భూ వివాదంలో నిందితుడిని తప్పించేందుకు ఏకంగా ఎస్సై సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఏఎస్సైని అరెస్టు చేశారు. ఈ ఘటన యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం వెలుగుచూసింది. యాదగిరిగుట్ట పట్టణ సీఐ జానకీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం డీసీపీ కార్యాలయంలో ఏఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రావు, 2017లో యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తించాడు. 2019లో ఆలేరు మండలంలోని మాసాయిపేటలో ఓ భూవివాదంలో అధికారి సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని అప్పటి ఎస్సై రమేశ్.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి తరఫున అడ్వకేట్ ఆలేరు కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అదే సమయంలో కేసు ముగిసినట్టుగా ఎస్సై రమేశ్ సంతకంతో ఫైనల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. యాదగిరిగుట్ట ఎస్సైగా విధులు నిర్వర్తించిన రమేశ్ బదిలీపై వెళ్లి ప్రస్తుతం ఆలేరులో పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న రమేశ్ తాను ఫైనల్ రిపోర్టు సమర్పించలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని యాదగిరిగుట్టలో ఫిర్యాదు చేశారు. అప్పటి రైటర్, ప్రస్తుతం డీసీపీ కార్యాలయ ఏఎస్సైగా పనిచేస్తున్న శ్రీనివాస్‌రావు ఎస్సై సంతకం ఫోర్జరీ చేసినట్టు సీఐ జానకీరెడ్డి, ఎస్సై రాజు తమ విచారణలో నిర్ధారించారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శ్రీనివాస్‌రావును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఫోర్జరీ సంతకం విషయంలో తన భర్తకు ఎలాంటి సంబంధంలేదని ఆయన భార్య నాగమణి ఆరోపించారు. సోమవారం యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిరసన తెలిపారు.
తాజావార్తలు
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..
- లాలూ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఆసుపత్రికి కుటుంబం
- వాహనదారులకు భారం కావొద్దనే వాహన పన్ను రద్దు
- మందిర్ విరాళాల స్కాం : ఐదుగురిపై కేసు నమోదు
- మహా సర్కార్ లక్ష్యంగా పీఎంసీ దర్యాప్తు: ఎమ్మెల్యే ఇండ్లపై ఈడీ దాడులు
- గౌడ సంఘాల నాయకులకు జీఓ కాపీ అందించిన మంత్రి
- రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు
- ఆస్పత్రి నుంచి కమల్‌హాసన్ డిశ్చార్జ్
- 12 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు..
- కుమారుడ్ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలున్న తల్లికి బెయిల్