e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News ఇప్పుడు కొన్నా.. 3 నెల‌లకు ఈఎంఐ షురూ.. మ‌హీంద్రా ఆఫ‌ర్‌ !

ఇప్పుడు కొన్నా.. 3 నెల‌లకు ఈఎంఐ షురూ.. మ‌హీంద్రా ఆఫ‌ర్‌ !

ఇప్పుడు కొన్నా.. 3 నెల‌లకు ఈఎంఐ షురూ.. మ‌హీంద్రా ఆఫ‌ర్‌ !

న్యూఢిల్లీ: క‌రోనా వ్యాప్తి చెంద‌డంతో వాహ‌నాల విక్ర‌యంపై ప‌డిన ప్రభావాన్ని తగ్గించుకోవ‌డానికి ఆటోమొబైల్‌ సంస్థలు పలు ప‌థ‌కాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఆ జాబితాలోకి మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా కూడా వ‌చ్చి చేరింది. వాహనాల కొనుగోలుదారుల‌కు రిలీఫ్ ఇచ్చే ప్లాన్ సిద్ధం చేసింది.

వినియోగ‌దారుడు త‌న‌కు నచ్చిన మహీంద్రా వాహనాన్ని ఇప్పుడు కొనుగోలు చేసి.. మూడు నెలలకు దాని ఈఎంఐను చెల్లించే అవకాశం కల్పించింది. నిత్యావసర సేవలు అందించే కస్టమర్లు వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయ‌డానికి కూడా ఇది వర్తిస్తుంది.

దీంతోపాటు వినియోగదారులకు కాంటాక్ట్‌ లెస్‌ సేవలు అందించ‌డానికి ‘ఓన్‌ ఆన్‌లైన్‌’ ప్లాట్‌ఫామ్‌ను మహీంద్రా వినియోగిస్తున్న‌ది. ఇందుకు ఆన్‌లైన్‌ రుణాలు సమకూరుస్తున్న‌ది.

ఓన్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌పై నుంచి వాహనాల‌ను కొనుగోలు చేసిన వారికి రూ.3,000 విలువైన యాక్సెసరీలు, రుణ మంజూరులో రూ.2,000 లబ్ధి చేకూరుస్తున్న‌ది.

కస్టమర్లు యాక్సెసిరీస్‌ ఖర్చు, ఎక్స్‌టెండ్‌ వారెంటీ చెల్లింపులు, వర్క్‌షాప్‌ చెల్లింపులనూ ఈఎంఐలుగా మార్చుకొనే సౌకర్యం కల్పించింది. వీరికి రూ.3,000 వరకు క్యాష్‌ బ్యాక్ కూడా ఆఫర్ చేస్తున్న‌ది.

మ‌హీంద్రా 7.25 శాతం వడ్డీ రేటుకే వాహన రుణాలను ఇస్తున్న‌ది. 100 శాతం ఆన్‌ రోడ్‌ ఫండింగ్‌ సమకూరుస్తున్న‌ది. ముందస్తుగా ముగించే రుణాలపై ఎటువంటి అదనపు ఛార్జి వసూలు చేయడంలేదు.

యాక్సెసిరీస్‌, ఎక్స్‌టెండెడ్‌ వారెంటీలపైనా రుణాలు మంజూరు చేస్తున్న‌ది. రూ.లక్షకు రూ.799 ఈఎంఐ చొప్పున అత్యధికంగా ఎనిమిదేండ్ల గ‌డువుతో రుణాలు ఇస్తున్న‌ది.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఆటోకు కరోనా సెగ

దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి

ఆన్‌లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సిందే

22 కోట్ల కోవాగ్జిన్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న ముంబై కంపెనీ

మరో వైరస్‌ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు గర్తింపు

అంబులెన్సుల దందా.. 40 కి.మీట‌ర్ల‌కు రూ.17 వేలు

న్యూయార్క్‌ కన్నా ముంబైలో రెట్టింపు!

గర్భిణులకు 2-డీజీ వద్దు

రాందేవ్‌ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ

ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్ లైవ్..

నో డౌట్‌: ఇప్ప‌ట్లో లీట‌ర్ పెట్రోల్ రూ.100 త‌గ్గ‌దు..!!

విదేశీ వ్యాక్సిన్ల‌కు ఆ ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి సిద్ధం!

పాక్‌తో క‌లిసి వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద మిస్సైళ్ల‌ను ప‌రీక్షిస్తున్న చైనా

పాకిస్థాన్‌లో మ్యూజియాలుగా రాజ్‌క‌పూర్‌, దిలీప్‌కుమార్ ఇళ్లు

అతిపెద్ద మాంస విక్రయ సంస్థ‌పై సైబ‌ర్ దాడి..

ఆ ఒక్క క‌రోనా వేరియంటే ఆందోళ‌న క‌లిగిస్తోంది: డ‌బ్ల్యూహెచ్‌వో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇప్పుడు కొన్నా.. 3 నెల‌లకు ఈఎంఐ షురూ.. మ‌హీంద్రా ఆఫ‌ర్‌ !

ట్రెండింగ్‌

Advertisement