ఆన్లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే
ఆన్లైన్ క్లాస్| వారంతా పన్నెండో తరగతి విద్యార్థులు. కరోనాతో కాలేజీలు మూతపడ్డాయి. దీంతో కాలేజీల వాళ్లు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడే వారికి చిక్కొచ్చిపడింది. చదువుకోవాలని ఉన్నా వారికి ఇంటర్నెట్ ఇబ్బందులు పెడుతున్నది.

తిరువనంతపురం: వారంతా పన్నెండో తరగతి విద్యార్థులు. కరోనాతో కాలేజీలు మూతపడ్డాయి. దీంతో కాలేజీల వాళ్లు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడే వారికి చిక్కొచ్చిపడింది. చదువుకోవాలని ఉన్నా వారికి ఇంటర్నెట్ ఇబ్బందులు పెడుతున్నది. వారి ఊర్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు. కష్టం మీద వచ్చిన లోస్పీడ్ ఉంటుంది. అయితే ఆన్లైన్లో క్లాసులు వినాలంటే నెట్ స్పీడ్‌గా ఉండాలి. అప్పుడే అధ్యాపకులు చెప్పే పాఠం సరిగా వినిపించడంతోపాటు కనిపిస్తుంది. దీంతో సిగ్నల్ కోసం వారంతా ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. అక్కడే లెస్సన్స్ విని సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు. ఇలా కేరళలోని రాజమాలకు చెందిన విద్యార్థులు పాఠం వినడానికి ప్రతిరోజు పాట్లుపడుతున్నారు.
కేరళలలోని ఇడుక్కి జిల్లాలో రాజమాల అనే గ్రామం ఉంది. ఆ ఊరికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. అయితే ఊర్లో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా రాదు. దీంతో ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరవికుళం నేషనల్ పార్కురు ప్రతి రోజు వెళ్తున్నారు. అక్కడి ఎత్తయిన ప్రదేశాల్లో సిగ్నల్ పుల్గా ఉంటుండంతో అక్కడే ఆన్లైన్ క్లాసులు విని వస్తున్నారు. తాము ప్రతిరోజు ఉదయం నేషనల్ పార్కుకు ఆటోలో వస్తున్నామని, తిరిగి సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నామని ఓ విద్యార్థి చెప్పాడు.

రాజమాలలో ఇంటర్నెట్ వసతి లేదు. కొన్ని ప్రదేశాల్లో వచ్చినా.. అది చాలా తక్కువ స్పీడ్‌తో వస్తున్నది. దీంతో ఇంటర్నెట్ కోసం ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లడం తమకు చాలా కష్టంగా ఉంది. కొన్నిసార్లు వానలు పడుతున్నాయి. దీనివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అరున్ అనే విద్యార్థి చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

