ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
ఇజ్రాయెల్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. ఇజ్రాయెల్ తదుపరి ప్రధానమంత్రిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిసారి సంకీర్ణ పాలన అధికారంలోకి వస్తుండటంతో 12 సంవత్సరాల బెంజమిన్ నెతన్యాహు పాలన ముగియనున్నది

జెరూసలెం : ఇజ్రాయెల్‌లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. ఇజ్రాయెల్ తదుపరి ప్రధానమంత్రిగా నాఫ్తాలి బెన్నెట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిసారి సంకీర్ణ పాలన అధికారంలోకి వస్తుండటంతో 12 సంవత్సరాల బెంజమిన్ నెతన్యాహు పాలన ముగియనున్నది
నిన్న మొన్నటి వరకు బాంబులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌లో ప్రస్తుత రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు అవకాశం చిక్కింది. ఇజ్రాయెల్‌లో తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నాఫ్తాలి బెన్నెట్ ప్రధాని పీఠం అధిష్ఠిస్తారని అక్కడి రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. గత మార్చి నెలలో జరిగిన ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు పార్టీ 61 సీట్లతో అదిపెద్ద పార్టీగా అవతరించినా.. మెజార్జీ మార్కు 121 సీట్లు సాధించలేదు. దాంతో రెండో స్థానంలో ఉన్న పార్టీని, వారి మిత్రపక్షాలను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా అధ్యక్షుడు రెవెన్ రివ్లిన్ ఆహ్వానించారు.
ఎనిమిది పార్టీల కూటమి
గడువు ముగియడానికి 38 నిమిషాల ముందు ప్రతిపక్ష నాయకుడు యెర్ లెపిడ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడినట్లు చెప్పారు. ఈ కూటమిపై ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు పార్టీల నాయకులు ప్రధాని అవుతారు. మితవాద యమినా పార్టీ నాయకుడు నాఫ్తాలి బెన్నెట్ ప్రధానిగా మొదట ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెన్నెట్ 2023 వరకు ప్రధాని పదవిలో కొనసాగుతారు. అనంతరం యేష్ అతిద్ పార్టీకి చెందిన యెర్ లెపిడ్ ప్రధాని అవుతారు.
రెండేండ్లలో ఇప్పటివరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే.. 5 వ సారి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. గత రెండేండ్లుగా ఇక్కడ రాజకీయ అస్థిరత ఉన్నది. గాజాలో వివాదం కారణంగా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అయింది.
ఇవి కూడా చదవండి..
సోమరిపోతు ఏనుగు.. నవ్వు తెప్పిస్తోంది..! వీడియో వైరల్
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

