అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
అంతరిక్షంలో శిధిలాలు ఇప్పుడు శాటిలైట్లకు ప్రమాదంగా మారుతున్నాయి. ఇలాంటి శిధిలం ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) యొక్క రోబోటిక్ చేయితో ఢీకొన్నది. ఈ సమాచారాన్ని కెనడియన్ స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది

టొరంటో : అంతరిక్షంలో శిధిలాలు ఇప్పుడు శాటిలైట్లకు ప్రమాదంగా మారుతున్నాయి. ఇలాంటి శిధిలం ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) యొక్క రోబోటిక్ చేయితో ఢీకొన్నది. ఈ సమాచారాన్ని కెనడియన్ స్పేస్ ఏజెన్సీ షేర్ చేసింది. శిధిలం తాకిడి కారణంగా అంతరిక్ష కేంద్రం యొక్క రోబోటిక్ చేయి దెబ్బతిన్నట్లు తెలిపింది. శిధిలం రోబోటిక్ చేయి థర్మల్ బ్లాంకెంట్తో ఢీకొనడంతో దానికి నష్టం వాటిల్లిందని అంతరిక్ష సంస్థ తెలిపింది. దెబ్బతిన్న రోబోటిక్ చేయి అంతరిక్ష కేంద్రంలో 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్నది.
కెనడియన్ అంతరిక్ష సంస్థ ప్రకారం, మే 12 న దర్యాప్తు జరిపినప్పుడు ఈ సంఘటన గురించి అంతరిక్ష శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. అయితే, రోబోటిక్ చేయిపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేదని, బాగానే పనిచేస్తుందని కూడా కనుగొన్నారు. శిధిలం ఢీకొట్టడంతో రోబోటిక్ చేయిలో ఒక రంధ్రం ఏర్పడింది. ఈ రోబోటిక్ చేయి పొడవు 17.6 మీటర్లు. దీని వ్యాసం 14 అంగుళాలు. చేయికి ఏర్పడిన రంధ్ర యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని వెల్లడించలేదు.
ఈ రోబోటిక్ చేయి భూమి నుంచి పంపిన అంతరిక్ష నౌకను పట్టుకోవడానికి పనిచేస్తుంది. ఇది కాకుండా, అంతరిక్ష నడక సమయంలో అంతరిక్ష శాస్త్రవేత్తలకు కూడా ఇది సహాయపడుతుంది. దీనిని కెనడియన్ స్పేస్ ప్రోగ్రాం కింద నిర్మించారు. అంతరిక్షంలో అనియంత్రితంగా కదిలే ఈ శిధిలాలు, గ్రహశకలాలు, ఇతర వస్తువులతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇబ్బందులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
ఆఫ్ఘన్ నుంచి 44 శాతం యూఎస్ బలగాల ఉపసంహరణ
శ్రీలంక తీరంలో మునిగిన ఇంధనం కార్గో షిప్
జమ్ములో మళ్లీ పాకిస్తాన్ కాల్పులు..!
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం చెల్లిస్తాం..
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

