e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News తెలంగాణ ప్ర‌జ‌ల చిరకాల కోరిక నెర‌వేరింది.. చ‌రిత్ర‌లో ఈరోజు

తెలంగాణ ప్ర‌జ‌ల చిరకాల కోరిక నెర‌వేరింది.. చ‌రిత్ర‌లో ఈరోజు

తెలంగాణ ప్ర‌జ‌ల చిరకాల కోరిక నెర‌వేరింది.. చ‌రిత్ర‌లో ఈరోజు

భాషా ప్రాతిప‌దిక‌న ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అడుగ‌డుగునా ఎదురైన అనేక అవ‌మానాల‌ను త‌ప్పించేందుకు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు నాయ‌క‌త్వంలో తెలంగాణ ప్ర‌జ‌లు అనిర్వ‌చ‌నీయ ఉద్య‌మం కొన‌సాగించారు. ప్రాణాలు పోయిన ఫ‌ర్వాలేదు.. తెలంగాణ రావాల్సిందే అని మొండిప‌ట్టుద‌ల‌తో ఉద్య‌మించి చివ‌ర‌కు తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల కోరికను 2014 లో స‌రిగ్గా ఇదే రోజున సాధ్య‌మ‌య్యేలా చేశారు. 1956లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు భాగంగా ఉన్న తెలంగాణ.. 58 ఏండ్ల‌ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోయి స్వ‌తంత్ర రాష్ట్రంగా ఆవిర్భ‌వించింది. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించిన ఈ ఏడేండ్ల కాలంలో ఎన్నో ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి.. అటు రాష్ట్రాల‌కు.. ఇటు కేంద్రానికి మార్గ‌ద‌ర్శ‌నంలా నిలిచేలా చేశారు కేసీఆర్‌.

ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర‌ ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి. తొలిద‌శ ఉద్య‌మంలో జ‌రిగిన త‌ప్పుల‌ను బేరీజు వేసుకుంటూ మ‌లి ద‌శ ఉద్య‌మ జెండా ఎత్తారు కేసీఆర్‌. జ‌ల‌దృశ్యంలో స‌మావేశ‌మైన వంద మంది పిడికిళ్లు బిగించ‌గా.. కేసీఆర్ స‌మ‌ర‌శంఖం పూరించారు. ఆనాటి నుంచి ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డే వ‌ర‌కు వెన‌క‌డుగు వేయ‌లేదు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా, ఎన్ని ఆటోపోట్లు వ‌చ్చినా మొక్క‌వోని దీక్ష‌తో ఉద్య‌మం సాగించి కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాట‌య్యేలా చేయ‌గ‌లిగారు కేసీఆర్.

ఉద్యమ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన రాజకీయ పార్టీగా ఆవిర్భవించగా, తెలంగాణ ప్రజలను చైతన్యపరచడంలో ప్రజాసంఘాలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ ఉద్యమం యావత్తు సాంస్కృతిక నేపథ్యంగా సాగింది. ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసేందుకు క‌ళాబృందాలు ఊరూరా క‌ళాజాత‌లు నిర్వ‌హించాయి. బోనాలు, బ‌తుక‌మ్మ పండ‌గ‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తూ పాదం క‌దిపారు. విదేశాల్లో సైతం తెలంగాణ పౌరులు త‌మ ఆకాంక్ష‌ల‌ను తెలుపుతూ ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. చివ‌ర‌కు కేంద్రం తెలంగాణ ఇవ్వ‌లేని ప‌రిస్థితుల‌ను క‌ల్పించి త‌మ చిర‌కాల కోరిక‌ను నెర‌వేర్చుకున్నారు.

అన్నింటా అభివృద్ధి తార‌క మంత్రం

తెలంగాణ ప్రాంతం ప్ర‌ధానంగా వ‌ర్షాధార‌ వ్య‌వ‌సాయ ప్రాంతం. ఇక్క‌డ కురిసే వాన‌ల‌తోనే పంట‌లు పండాలంటే అరిగోస ప‌డ‌టాన్ని గ‌మ‌నించిన కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌గానే వ్య‌వ‌సాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ రైతుల‌ను రాజులుగా చేయ‌డానికి కంక‌ణ‌బ‌ద్ధుల‌య్యారు. రైతు బంధు, రైతు బీమాల‌తో ఊరూరా వ్య‌వ‌సాయం జోరుగా సాగేలా చేయ‌గ‌లిగారు. ఇంటింటికి తాగునీరు, ప్ర‌తి ఆయ‌క‌ట్టుకు సాగునీరు అందేలా చేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా విద్యుత్ వెలుగుల‌ను అందిస్తూ తెలంగాణ‌ను ప్ర‌త్యేకంగా నిలిపారు. నిరుపేద‌లు, వృద్ధులు, విక‌లాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు, వివిధ కుల‌వృత్తుల‌వారిని ఆదుకునేందుకు సామాజిక ఫించ‌న్ల‌ను అంద‌జేసి వారికి అండ‌గా నిలిచారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌తో నిరుపేద అమ్మాయిల‌కు మేన‌మామ అయ్యారు.

మ‌న‌కు మ‌న‌మే పోటీ..

కొవిడ్‌ -19 సంక్షోభం, లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఫుడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులను అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆర్ధిక ప్రగతిని సాధించడం కోసం మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్‌ నగరం ఐటీ రంగానికి వెన్నెముక కాగా.. వీటితోపాటు ఫార్మా, టెక్స్‌టైల్‌ సిటీలు పారిశ్రామికాభివృద్ధికి చోదకాలుగా మారాయి. పాల‌న‌ను వికేంద్రీక‌రించి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ప్ర‌భుత్వాన్ని తీసుకొచ్చింది. తండాల‌ను పంచాయ‌తీలుగా మార్చి పాల‌న‌ను వారి చేతుల్లో పెట్టింది. నిరుద్యోగాన్ని త‌రిమికొట్టేందుకు ప‌క‌డ్బందీగా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ నియామ‌కాలు జ‌రుపుతున్న‌ది. ‘స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష’ అన్న ఆచార్య జయశంకర్ సార్‌ మాటల్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారు. దేశానికి దిశా నిర్దేశం చేసేలా తెలంగాణ కీలక శక్తిగా మారాలన్న జ‌య‌శంక‌ర్ సారు మాట‌ల‌ను నిజం చేస్తూ దేశం యావ‌త్తు మ‌న‌వైపు చూసి నేర్చుకునేలా మారుతుండ‌టం హ‌ర్షించ‌ద‌గిన‌ది.. గ‌ర్వించ‌ద‌గిన‌ది..

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2009: లష్కర్ వ్యవస్థాపకుడు హఫీజ్ మొహమ్మద్ సయీద్‌ను ముంబై దాడి కేసులో విడుద‌ల చేసిన‌ పాకిస్తాన్ కోర్టు

1988: సుప్ర‌సిద్ధ‌ నటుడు రాజ్ కపూర్ కన్నుమూత‌

1972: నెవాడాలోని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్, బందీల విడుదలకు పెద్ద మొత్తంలో డ‌బ్బు డిమాండ్

1966: చంద్రునిపై విజ‌య‌వంతంగా దిగిన అమెరికన్ అంతరిక్ష వాహనం

1953: క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం

1898: బొంబాయిలో ప్లేగు వ్యాప్తికి కారణం ఎలుకలు, ఈగలు అని కనుగొన్న డాక్టర్ పాల్-లూయిస్ సైమండ్స్

1881: రేడియోకు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న మార్కోని

1818: బొంబాయిలో మరాఠ సంకీర్ణ దళాలను ఓడించిన‌ బ్రిటిష్ దళాలు

ఇవి కూడా చ‌ద‌వండి..

యూట్యూబ‌ర్ల‌ను ప‌న్ను కింద‌కు తెచ్చిన అమెరికా

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృత‌తో తింటూ ఆరేండ్ల శ‌ర‌ణార్థి క‌న్నుమూత‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ ప్ర‌జ‌ల చిరకాల కోరిక నెర‌వేరింది.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement