బెంగుళూరు, మే 30 : అంతా అనుకున్నట్టే కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. శనివారం విధాన సౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన ఎన్నిక జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ సీఎం సిద్ధరామయ్య డీకే పేరును ప్రతిపాదించగా.. హోం మంత్రి పరమేశ్వర బలపరిచారు. దీనికి మిగతా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ కర్ణాటక నూతన సీఎంగా లోక్ భవన్ లోని గ్లాస్ హౌస్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ మేరకు గవర్నర్ను కలిసి తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరనున్నారు. శివకుమార్ రెండేండ్ల పాటు సీఎం పదవిలో కొనసాగనున్నారు.