e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

మ‌న శ‌రీరంలో జ‌రిగే మార్పులే మ‌న ఆరోగ్యానికి సూచిక‌లు. శ‌రీరంపైనా, లోనా వ‌చ్చే ఆక‌స్మిక మార్పులు, దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగే కొన్ని ల‌క్ష‌ణాల‌ను తేలిగ్గా తీసుకుంటుంటాం. అయితే, వీటి వ‌ల్ల మ‌న‌ భ‌విష్య‌త్ ఆరోగ్యానికి ముప్పువాటిల్లే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ని సెల‌విస్తున్నారు వైద్య‌నిపుణులు. అందుక‌ని ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌వ‌ద్దంటున్నారు వైద్యులు. అవేంటంటే..

మ‌న‌కు ఏ ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా ముందుగా మ‌న శ‌రీరంలో కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వీటిని ఆధారంగా చేసుకోని నివారించుకోవ‌చ్చు. ఒక్కో వ్యాధికి ఒక్కో స‌మ‌స్య క‌నిపిస్తుంది. వాటిని ముంద‌స్తుగా గుర్తించ‌డం చాలా అవ‌స‌రం. చాతీలో నొప్పి, ఒక్క‌సారిగా శ‌క్తిహీనంగా మారిపోవ‌డం, అల‌స‌ట‌, దృష్టిలో మార్పులు.. వంటి ల‌క్ష‌ణాల కార‌ణంగా కొన్నికొన్ని సార్లు మ‌నం ఎమ‌ర్జెన్సీ రూం వ‌ర‌కు వెళ్లాల్సిరావ‌చ్చు.

శ‌రీరం బ‌రువు త‌గ్గిపోవ‌డం..

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

మ‌న శరీరం బ‌రువు ఒకేసారి పెర‌గ‌డం గానీ, త‌గ్గ‌డం గానీ జ‌రుగ‌దు. అలా జ‌రుగుతున్న‌దంటే అనుమానించాల్సిందే. కొన్నిసార్లు క్యాన్స‌ర్లుకానీ, థైరాయిడ్ స‌మ‌స్య‌లు, సీలియాక్ ఆరోగ్య స‌మ‌స్య‌లు, హెచ్ఐవీ వంటి ఇన్‌ఫెక్ష‌న్‌, హెప‌టైటిస్ వంటివి వ‌చ్చిన‌ప్పుడు శ‌రీరం ఒక్క‌సారిగా బ‌రువు త‌గ్గిపోతుంది.

పుట్టుమ‌చ్చ‌లు ఒకేలా ఉండాలి..

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

శరీరంపై ఉండే పుట్టుమ‌చ్చ‌లు మ‌న ఆరోగ్యానికి సూచిక‌లుగా చెప్పుకోవాలి. వీటిలో త్వ‌రితంగా వ‌చ్చే మార్పులు, రంగులు మారుతుండ‌టం, పెరుగుతుండ‌టం వంటివి మంచిది కాదు. ఇవి చ‌ర్మ క్యాన్స‌ర్లకు ల‌క్ష‌ణాలుగా గుర్తుంచుకోవాలి. పుట్టుమ‌చ్చ‌ల‌ను ఎప్పుడూ గ‌మ‌నిస్తూ ఉండాలి. మార్పులు రాగానే వైద్యుల స‌ల‌హా తీసుకోవాలి.

అతినిద్ర అన‌ర్ధ‌దాయ‌కం..

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

నిద్ర‌పోవ‌డం ఏమాత్రం ఎక్కువైనా కూడా ఆరోగ్య స‌మ‌స్య వేధిస్తున్న‌ట్టు భావించాలి. మ‌నం సాధార‌ణంగా 7-8 గంట‌లు నిద్ర‌పోవాలి. అంత‌కుమించి నిద్ర‌పోవ‌డం వ‌ల్ల ఆందోళ‌న‌, క్రానిక్ ఇన్ఫ్ల‌మేష‌న్‌, మ‌ల్టిపుల్ సిర్రోసిస్ వంటి వ్యాధులు మ‌న‌ల్ని చుట్టుముట్టిన‌ప్పుడు మ‌నం ఎక్కువ‌గా నిద్ర‌పోతుంటాం అని గ‌మ‌నించాలి.

అదే ప‌నిగా ద‌గ్గు రావ‌డం..

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

అంద‌రిలో ద‌గ్గు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే రెండు నెల‌ల‌కు మించి ద‌గ్గు అలాగే కొన‌సాగుతున్న‌దంటే మాత్రం అనుమానించాల్సిందే. ఆస్త‌మా, యాసిడ్ రిఫ్ల‌క్స్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న స‌మ‌యాల్లో కూడా ద‌గ్గు నిర‌వ‌ధికంగా వ‌స్తుంటుంది. అలాగే కొన్నిర‌కాల క్యాన్స‌ర్ల‌లో కూడా ద‌గ్గు నిరంతరం వేధిస్తుంది.

అపెండిసైటిస్ అయితే..

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

పొట్ట‌కిందిభాగంలో కుడి చేతివైపున నొప్పి వ‌స్తే తేలిగ్గా తీసుకోకూడ‌దు. ఇది అపెండిసైటిస్‌గా అనుమానించాలి. 24 గంట‌ల్లోగా వైద్యుడ్ని సంప్ర‌దించి చికిత్స తీసుకోవ‌డం ద్వారా ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. ఏమాత్రం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించినా చ‌నిపోవ‌డం ఖాయం.

ఓ భాగంలో ఒక‌టే నొప్పెట్టినా..

ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

శ‌రీరంలో ఏ భాగంలోనైనా విడ‌వ‌కుండా దీర్ఘ‌కాలిక నొప్పి వ‌చ్చిన‌ట్ట‌యితే వెంట‌నే వైద్యుడ్ని సంప్ర‌దించాల్సిందే. సాధార‌ణంగా నొప్పి కొద్ది సేపు ఉండి త‌గ్గిపోతుంది. అయితే, ఇలా చాలా స‌మ‌యంపాటు నొప్పి రావ‌డం అనేది ప‌లు వ్యాధులకు ల‌క్ష‌ణాలుగా గుర్తించి వైద్యుల సల‌హాలు తీసుకోవాలి.

శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తుండాలి. ఏ చిన్న మార్పు క‌నిపించినా ఏదో ఒక స‌మ‌స్య‌గా అనుమానించి అడ్వాన్సుగా వైద్య‌చికిత్స తీసుకోవ‌డం ద్వారా వ్యాధి ముద‌ర‌కముందే న‌యం చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్

గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృత‌తో తింటూ ఆరేండ్ల శ‌ర‌ణార్థి క‌న్నుమూత‌

ప్ర‌ధాని క‌ల‌ల ప్రాజెక్టులో ప్ర‌మాదం.. ఇద్ద‌రు కూలీలు మృతి

నేపాల్ రాజ కుటుంబం ఊచ‌కోత‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఆర్థిక ఇబ్బందుల‌తో స‌ర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు

సిగ‌రెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎన్నో..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ ఆరు ల‌క్ష‌ణాల‌ను అశ్ర‌ద్ధ చేయ‌కండి

ట్రెండింగ్‌

Advertisement