ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు చాలా మంది అమ్మాయిలు సర్రోగేట్ తల్లులుగా మారుతున్నట్లు తెలుస్తున్నది

కరోనా వైరస్ అందరిపై ప్రభావం చూపుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్న వేళ.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు చాలా మంది అమ్మాయిలు సర్రోగేట్ తల్లులుగా మారుతున్నట్లు తెలుస్తున్నది. ఈ వైఖరి గుజరాత్లో బయటకు పొక్కినా.. వేరే రాష్ట్రాల్లో గుంబనంగా సాగిపోతున్నది. చేయడానికి పని లేకపోవడంతో బతికేందుకు పెళ్లికాకుండానే అమ్మలయ్యేందుకు సిద్ధపడుతున్నారు.
కరోనా కారణంగా వ్యాపారాలు కొనసాగక ఉద్యోగాలు పోతున్నాయి. ఈ కారణంగా మహిళలు తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఒక్క గుజరాత్‌లోనే ఇలాంటి 20-25 కేసులు నమోదయ్యాయి. ఆశ్చర్యకరంగా వీరిలో చాలా మంది పెండ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు. సర్రోగేట్ తల్లిగా ఉండేందుకు ఒప్పుకున్నవారికి రూ. 3-4 లక్షలతో పాటు వైద్య ఖర్చులు అందుతాయి. తూర్పు అహ్మదాబాద్‌లో 23 ఏండ్ల బాలిక ఇళ్లలో పనికి వెళ్లేది. అయితే, కరోనా వ్యాప్తి కారణంగా పని మానివేయడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈమె పరిస్థితి చూసిన ఒకరు సర్రోగేట్ తల్లి సలహా ఇచ్చారు. ఈ మార్గాన్ని ఎంచుకున్న ఆమె కవలలకు సర్రోగేట్ తల్లి కానున్నది.
తండ్రి విడిచిపెట్టడంతో..
నా పేరు రీమా. వయసు 23 సంవత్సరాలు. ఇంకా వివాహం కాలేదు. నాన్న నన్ను, నా తల్లిని వదిలి వేరే ఇంట్లో స్థిరపడ్డాడు. మేం అద్దె ఇంట్లో ఉంటున్నాము. నన్ను పోషించేందుకు ఇన్నాళ్లు నా తల్లి రెక్కల కష్టం చేసింది. ఇటీవలి వరకు ఉద్యోగం చేశారు. అయితే కరోనా కారణంగా చేయడానికి పనిలేకపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇంటి అద్దె నెలనెలా భారమవుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు సర్రోగేట్ తల్లి కావాలని నిర్ణయించుకున్నాను. డాక్టర్ ద్వారా సర్రోగసీ ద్వారా పిల్లలు పుట్టాలని కోరుకునే జంటను సంప్రదించగా.. వారు కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఇప్పుడు మాకు ఆర్థికంగా కొంత వెసులుబాటుగా ఉన్నది.
పిల్లల భవిష్యత్ కోసం తప్పనిసరై..
రాజశ్రీ అనే మహిళ భర్త చనిపోయాడు. ఆదాయం లేకపోవడంతో టిఫిన్ సెంటర్లో పనికి కుదిరింది. కరోనా లాక్‌డౌన్‌తో అది కూడా మూతపడటంతో.. పిల్లల భవిష్యత్ కోసం తప్పనిసరై సర్రోగేట్ తల్లి కావాలని నిర్ణయించుకున్నది. తెలిసిన వ్యక్తి ద్వారా వైద్యుడిని సంప్రదించి ఒక జంటకు సర్రోగేట్ తల్లిగా మారాను. వారు ఇచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు తీరుస్తున్నారు. కొంత ఇప్పుడిచ్చారు.. డెలివరీ తర్వాత మిగతాది ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని ఆమె ఏడుస్తూ చెప్పింది.
భర్త ఉద్యోగం కోల్పోవడంతో..
కరోనా మహమ్మారి వ్యాప్తితో లాక్డౌన్ విధించగా రేఖ అనే మహిళ భర్త ఉద్యోగం కోల్పోయాడు. ఇంటిని నడిపించేందుకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దాంతో పస్తులుండకుండా చూసుకునేందుకు ఇంట్లోని వస్తువులను అమ్మేశాడు. అయినా, మార్గం లేకపోవడంతో భర్తను ఒప్పించి రేఖ సర్రోగేట్ తల్లిగా మారింది. బయటకు వెళ్లేందుకు అవసరం లేకుండా ఇంటి అవసరాలు తీరేందుకు ఈ పనికి రేఖ ఒప్పుకున్నది. దాంతో ఇప్పటికిప్పుడు ఆర్థిక సమస్యలు తీరాయని కన్నీళ్లు పెట్టుకుంది రేఖ.
( ఈ కథనంలో మహిళల పేర్లు మార్చాం)
ఇవి కూడా చదవండి..
సిగరెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
జూలై 4 నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పీడీఎం దేశవ్యాప్త ఆందోళన
బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకర్శణీయమైన డిజైన్
ఎల్ఓసీపై 3 నెలలుగా ఒక్క బుల్లెట్ పేలలేదు : జనరల్ ఎంఎం నరవణె
వానాకాలం కరోనా వైరస్‌తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

