e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News సిగ‌రెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎన్నో..!

సిగ‌రెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎన్నో..!

సిగ‌రెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎన్నో..!

పొగ తాగ‌ని వాడు దున్న‌పోతై పుట్టున్.. అని క‌న్యాశుల్కంలో గిరీశం నోట గుర‌జాడ అప్పారావు చెప్పింది నేటి యువ‌తలో ఎంత‌మందికి తెలుసున‌న్న‌ది తెలియ‌దు కానీ.. మూతిమీద మీసాలు రాని ప్ర‌తీ ఒక్క‌రూ సిగ‌రెట్ తాగేందుకే మొగ్గు చూపుతున్నారు. సిగ‌రెట్ స్మోకింగ్‌ను స్టాట‌స్ సింబ‌ల్‌గా ఎంచుకొంటున్నారు. పొగ‌తాగ‌డం వ‌ల్ల చాలా ర‌కాలుగా శ‌రీరానికి ముప్పు ఉన్న‌ద‌ని తెలిసానా సిగ‌రెట్ ద‌మ్ము కోసం తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. సరదా కోసమో.. లేక అభిమాన హీరో తనదైన శైలిలో స్మోకింగ్ చేయడాన్ని చూసిన కొందరు.. ముచ్చటపడి చేసుకున్న ఈ అలవాటు.. క్రమంగా వారిని ఆక్రమించి విడదీయరాని బంధంగా మారిపోతుంది. పొగాకు ఉత్పత్తుల్లో దాదాపు 4వేల రకాల రసాయనాలు ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. ఆరోగ్యాన్ని, ధనాన్ని నష్టపరిచే ఈ దురలవాటు నుంచి బయట పడాలని ప్రయత్నించినా సాధ్యంకాని విధంగా దానికి దాసోహం అవుతున్నారు. ప్ర‌పంచ పొగాకు ర‌హిత దినోత్స‌వం సంద‌ర్భంగా పొగాకు, దాని ఉత్ప‌త్తుల ద్వారా ఎలాంటి హాని ఉంటుందో తెలుసుకుందాం.

మానుకోవ‌డం తెలియ‌క తిక‌మ‌క‌..!

సిగ‌రెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎన్నో..!

సిగరెట్‌, బీడీ, చుట్ట, హుక్కా పీల్చడం ఇలా ఏరూపంలో ఉన్నా.. అంతిమంగా పొగతాగడమే. దీనివల్ల పొగాకులోని నికోటిన్‌తో టార్‌ , కార్బన్‌ మోనాక్సైడ్‌, హైడ్రోజన్‌ సైనైడ్‌, అమ్మోనియా, ఫార్మల్డిహైడ్‌, ఆర్సెనిక్‌, డీడీటీ వంటి హానికర పదార్థాలు శరీరంలోకి తేలిగ్గా చేరతాయి. సిగరెట్లు ఎక్కువగా తాగేవారి ఊపిరితిత్తుల్లో బూడిద పేరుకుపోయి నల్లగా తయారవుతాయి. ఊపిరితిత్తుల్లోని కణాలు కణుతులుగా మారి క్యాన్సర్‌గా రూపుదిద్దుకుంటుంది.

స్మోకింగ్‌ చేసేవారు తమ ప్రాణాల పట్లే కాదు, ఇతరుల ప్రాణాల విషయంలోనూ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తాము స్మోకింగ్‌ చేయడమే కాకుండా తమ పక్కన ఈ అలవాటు లేనివారికీ పాసివ్‌ స్మోకింగ్‌ ద్వారా విషాన్ని అందిస్తున్నారు. ఒక్క సిగ‌రెట్ తాగ‌డం ఒక్క‌టే కాదు.. పొగాకు సంబంధ ప‌దార్థాలైన‌ గుట్కా, ఖైనీ, జ‌ర్దా పాన్ వంటి తీసుకోవ‌డం కూడా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చేవే అని గుర్తుంచుకోవాలి. చాలా మంది వ్యాధులు మొదలయ్యే వరకు స్మోకింగ్‌ చేస్తూ ఆ తర్వాత ఈ అలవాటును ఎలా వదిలేయాలో తెలియక తికమక పడుతుంటారు.

అన్ని అవ‌య‌వాల‌పై ప్ర‌భావం..!

సిగ‌రెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎన్నో..!

పొగాకు శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. పొగాకు వినియోగించే అలవాటుని అనుసరించి ఆయా శరీర భాగాలు ప్రభావితమ‌వుతుంటాయి. పొగతాగే వారు, పొగాకుని వాడేవారి చర్మం వయసుతో సంబంధం లేకుండా వేగంగా ముడతలు పడుతుంది. పొగాకులోని నికోటిన్‌ వయసుతో సంబంధం లేకుండా కాటరాక్ట్‌, గ్లకోమా వంటి సమస్యలను తీసుకొస్తుంది. ఇవి క్రమంగా పూర్తి అంథత్వానికి కారణమవుతాయి. పొగాకు వాడకం లైంగిక జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. పురుషులలో ఇది అంగస్తంభన సమస్యలకు కారణమవుతుంది. స్త్రీలలో లైంగికాసక్తిని తగ్గిస్తుంది.

పొగాకు వాడకం ముందుగా నోరు, దంతాలు, చిగుళ్లు, నాలుక, ఇతర భాగాలను దెబ్బతీస్తుంది. నోటిలో అల్సర్లు రావడంతో మొదలై, అది క్రమంగా క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. ధూమపానం వల్ల పొగాకులోని నికోటిన్‌ నేరుగా మెదడుకు చేరుకుని.. నెమ్మదిగా రక్తపోటును పెంచుతుంది. పొగతాగే అలవాటు కార‌ణంగా మూత్రపిండాల పనితీరు మందగించ‌డ‌మే కాకుండా మూత్రాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చివ‌ర‌గా.. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అనే మాట ఎక్కడ చూసినా కనపడుతుంది. బస్సులు, సినిమా థియేట‌ర్లు, దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాల్లో.. ఇలా అనేక చోట్ల పెట్టే బోర్డులను సిగరెట్ ప్రియులు మాత్రం పట్టించుకోవడం లేదు. పొగాకుతో ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నందున ఇక‌నైనా స్మోకింగ్‌కు బైబై చెప్పండి.. మీతోపాటు మీ ఇంటిల్లిపాది ఆరోగ్యం కాపాడండి.

ఇవి కూడా చ‌ద‌వండి..

మువ్వ‌న్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చ‌రిత్ర‌లో ఈరోజు

జూలై 4 నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు వ్య‌తిరేకంగా పీడీఎం దేశవ్యాప్త ఆందోళ‌న‌

బీఎండ‌బ్ల్యూ నుంచి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. ఆక‌ర్శ‌ణీయ‌మైన డిజైన్‌

ఎల్ఓసీపై 3 నెల‌లుగా ఒక్క బుల్లెట్ పేల‌లేదు : జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వ‌ణె

వానాకాలం క‌రోనా వైర‌స్‌తో జాగ్ర‌త్త‌.. ఇవి పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిగ‌రెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎన్నో..!

ట్రెండింగ్‌

Advertisement