Jeep Wrangler facelift | భారత్ మార్కెట్లోకి జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్.. రూ.67.65 లక్షలకు లభ్యం..!
Jeep Wrangler facelift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్యూవీ జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ (Zeep Wrangler facelift) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Jeep Wrangler facelift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్యూవీ జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ (Zeep Wrangler facelift) కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గతేడాది గ్లోబల్ మార్కెట్లో దీన్ని ఆవిష్కరించారు. అడాస్ వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ (Zeep Wrangler facelift) రెండు వేరియంట్లు – అన్ లిమిటెడ్, రుబికాన్ వర్షన్లలో లభిస్తుంది. జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ (Zeep Wrangler facelift) అన్ లిమిటెడ్ ధర రూ.62.65 లక్షలు (ఎక్స్ షోరూమ్), రూబికన్ వర్షన్ ధర రూ.66.65 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ప్రస్తుత మోడల్ కారు కంటే రూ.5 లక్షలు ఎక్కువ. జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ కారు ఆవిష్కరించక ముందే 100 యూనిట్స్ ప్రీ బుక్ అయ్యాయి. వచ్చేనెలలో డెలివరీ ప్రారంభం అవుతుంది. లాండ్ రోవర్ డిఫెండర్, త్వరలో మార్కెట్లోకి వస్తున్న 5-డోర్ థార్, 5-డోర్ గుర్ఖా కార్లతో జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ పోటీ పడుతుందని భావిస్తున్నారు.
జీప్ రాంగ్లర్ (Zeep Wrangler) ఫేస్ లిఫ్ట్ కారు ఆల్ బ్లాక్ ఔట్ గ్రిల్లె, ప్రస్తుత మోడల్ జీప్ రాంగ్లర్ కన్నా సన్నగా స్పెషల్ 7-స్లాట్ డిజైన్‌తో వస్తుంది. గ్లోబల్ వేరియంట్ 17-20 అంగుళాల తేడాతో 10 డిఫరెంట్ డిజైన్లలో అల్లాయ్ వీల్స్, 35 అంగుళాల టైర్లతో వస్తున్నాయి. స్టాండర్డ్ మోడల్ సాఫ్ట్ టాప్, బాడీ కలర్ హార్డ్ టాప్, బ్లాక్ హార్డ్ టాప్, హార్డ్ అండ్ సాఫ్ట్ కాంబినేసన్, సన్ రైడర్ టాప్ మోడ్ లో ఉంటుంది. కానీ ఇండియా వేరియంట్ రూఫ్, అల్లాయ్ వీల్స్ లో లిమిటెడ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటది.
అన్ని స్టాండర్డ్ వేరియంట్లలో జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ యూ-కనెక్ట్ 5 సిస్టమ్, 62 ఫేమస్ ట్రైల్స్ ఆఫ్ రోడ్ గైడ్, ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ రీడిజైన్ చేశారు. 12-వే పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, న్యూ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఉంటాయి.
జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ ఇండియా వేరియంట్ కారు 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 70 హెచ్‌పీ, 400 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, స్టాండర్డ్ గా సెలెక్ట్-ట్రాక్ ఫుల్ టైం 4డబ్ల్యూడీ సిస్టమ్ ఉంటది. భారత్ మార్కెట్లోకి సింగిల్ పవర్ ట్రైన్ ఆప్షన్ తో వస్తున్నది. సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రేర్ సెన్సర్స్, కెమెరా ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

