మువ్వన్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చరిత్రలో ఈరోజు
మూడు రంగుల్లో ఉన్న జెండాకు కాంగ్రెస్ పార్టీ 1921 లో సరిగ్గా ఇదే రోజు అధికారిక గుర్తింపునిచ్చింది. స్వాతంత్ర్య వచ్చిన అనంతరం కొన్ని మార్పులతో ఇదే జెండానే భారతదేశ త్రివర్ణ పతాకంగా గుర్తించారు

మూడు రంగుల్లో ఉన్న జెండాకు కాంగ్రెస్ పార్టీ 1921 లో సరిగ్గా ఇదే రోజు అధికారిక గుర్తింపునిచ్చింది. స్వాతంత్ర్య వచ్చిన అనంతరం కొన్ని మార్పులతో ఇదే జెండానే భారతదేశ త్రివర్ణ పతాకంగా గుర్తించారు. ఈ జెండాను పింగలి వెంకయ్య తయారుచేశారు. జెండా భారతదేశంలోని రెండు ప్రధాన మతాలను సూచించే ఎరుపు, ఆకుపచ్చ రంగులను కలిగి ఉన్నది. ఈ జెండాను గాంధీజీకి చూపించగా.. జెండాలో తెలుపు రంగు, నూలు వడికే చక్రం ఉంచాలని పింగలికి సూచించారు. తెలుపు రంగు భారతదేశంలోని మిగిలిన మతాలను, చర్ఖా స్వదేశీ ఉద్యమాన్ని సూచిస్తుంది.
1923 లో నాగ్‌పూర్‌లో జరిగిన శాంతియుత నిరసన సందర్భంగా వేలాది మంది ప్రజలు ఈ జెండాను చేతిలో పట్టుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో సుభాష్ చంద్రబోస్ కూడా ఈ జెండాను ఉపయోగించారు. అదే సమయంలో జెండా రంగులను మతాలతో అనుసంధానించడంపై వివాదం చెలరేగింది. జెండాకు పసుపు రంగును చేర్చాలని లేదంటే అన్ని మత చిహ్నాలను తొలగించాలని సిక్కులు డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ జెండా కొన్ని మార్పులు చేసి భారతదేశ పతాకంగా మార్చాలని రాజ్యాంగ కమిటీ నిర్ణయించింది. జెండా మధ్యలో ఉన్న నూలు వడికే చర్ఖా స్థానంలో అశోక చక్రం వచ్చి చేరింది. జెండాను మొదట అధికారికంగా 1947 జూలై 22 న ఎగురవేశారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ ప్రపంచ పొగాకు రహత దినోత్సవం
2017: భారత్‌ను ప్రిఫరెన్షియల్ ట్రేడింగ్ జాబితా నుంచి తొలగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
1962: వేలాది మంది యూదులను చంపాడన్న ఆరోపణలపై అడాల్ఫ్ ఇక్మాన్ను ఉరితీసిన ఇజ్రాయెల్
1961: స్వతంత్ర దేశంగా రూపుదిద్దుకున్న దక్షిణాఫ్రికా
1959: టిబెట్ నుంచి బహిష్కరించిన తర్వాత భారత్‌లో ఆశ్రయం పొందిన బౌద్ధ మత గురువు దలైలామా
1935: పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో భూకంపం, 50 వేలకు పైగా ప్రజలు దుర్మరణం
1927: తన ప్రసిద్ధ కారు మోడల్ టీ ఉత్పత్తిని నిలిపివేసిన కార్ల తయారీదారు ఫోర్డ్ సంస్థ
1907: అమెరికా న్యూయార్క్ నగరంలో మొదటిసారి అందుబాటులోకి ట్యాక్సీ సేవలు
1725: హోల్కర్ రాజవంశం రాణి అహల్యాబాయి హోల్కర్ జననం
ఇవి కూడా చదవండి..
జూలై 4 నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పీడీఎం దేశవ్యాప్త ఆందోళన
బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకర్శణీయమైన డిజైన్
ఎల్ఓసీపై 3 నెలలుగా ఒక్క బుల్లెట్ పేలలేదు : జనరల్ ఎంఎం నరవణె
వానాకాలం కరోనా వైరస్‌తో జాగ్రత్త.. ఇవి పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

